Loksabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి 200 సీట్ల కంటే మించి రావు: కేసీఆర్
ABN , Publish Date - May 03 , 2024 | 10:24 PM
లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి 200 ఎంపీ సీట్ల కంటే మించి రావని బీఆర్ఎస్ అధినేతచ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) అన్నారు. శుక్రవారం రామగుండంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన రోడ్ షోలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నదీ జిల్లాల్లో అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించు కోవడం లేదని ప్రశ్నించారు.
పెద్దపల్లి: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి 200 ఎంపీ సీట్ల కంటే మించి రావని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) అన్నారు. 48గంటల తర్వాత నిషేదించబడిన నా గొంతు మాట్లాడుతుంది. నేను ఏం చేశానని నా గొంతు ఆపారు, నా గొంతును నొక్కేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రామగుండంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన రోడ్ షోలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నదీ జిల్లాల్లో అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కేఆర్ఎంబీపై ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు.అదానీ మెప్పు కోసం మోదీ అధిక ధరలు పెట్టి బొగ్గు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఇదే ముఖ్యమంత్రి దావోస్‌కు వెళ్లి అదానీతో ఒప్పందం చేసుకున్నారని విరుచుకుపడ్డారు.
TS News: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్
సింగరేణిని దెబ్బ తీస్తారు..
పార్లమెంట్ ఎన్నికల తర్వాత మోదీ - రేవంత్ కలిసి సింగరేణిని దెబ్బ తీస్తారని విమర్శించారు. సింగరేణి కార్మికులు చైతన్యంతో ఆలోచించాలని చెప్పారు. సింగరేణికి ముప్పు పొంచి ఉంది.. తస్మాత్ జాగ్రత్త అని కేసీఆర్ హెచ్చరించారు. తాను ప్రధాని మోదీని తెలంగాణకు రానివ్వలేదని.. వస్తే ఖబర్దార్ అని హెచ్చరించానని అన్నారు. సింగరేణిని కాపాడుకోవాలంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ మాటలను ప్జలు నమ్మొద్దని అన్నారు.10ఏళ్ల మోదీ పాలనలో దేశం చాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Lok Sabha Polls: తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చేసింది.. హామీలే హామీలు
రూపాయి విలువ పడి పోయింది..
దేశంలో రూపాయి విలువ పడి పోయిందని.. పబ్లిక్ సెక్టార్లను అమ్మేస్తున్నారని.. ప్రైవేటీకరణ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ ఈ ఎన్నికల్లో గెలిస్తే మత విద్వేషాలు, హింస తప్పితే ఎలాంటి అభివృద్ధి జరగదని చెప్పుకొచ్చారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని తెలిపారు. 15 మంది బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామని ఉద్ఘాటించారు. ప్రజలు విజ్ఞతతో అలోచించి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని.. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
AP Election 2024: పిఠాపురంలో పవన్ పోటీపై ముద్రగడ కూతురు సంచలన వ్యాఖ్యలు.. జగన్‌కు ఊహించని షాక్
కాంగ్రెస్ -బీజేపీ గుండెలు వణుకుతున్నాయి
‘‘చేనేత కార్మికుల సమస్యలపై కోపంతో ఒక మాట అన్నా. నా బస్సు యాత్రతో కాంగ్రెస్ -బీజేపీ గుండెలు వణుకుతున్నాయి. ఇద్దరు కుమ్ముక్కయి నాపై దాడి మొదలు పెట్టారు. బ్యాన్ ముగిసిన తర్వాతనే నేను బయటకు వచ్చాను. రాజకీయాల్లో మతం గురించి మాట్లాడటం నిబంధనలకు విరుద్ధం.మోదీ,అమిత్ షాలు దేవుని ఫొటోలు పెట్టుకుని అడ్డగోలుగా మాట్లాడుతున్నా, హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెడుతున్నా ఈసీ పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నోటికోచ్చినట్టుగా మాట్లాడుతున్నా ఈసీ చర్యలు తీసుకోవడం లేదు.వేల ఎకరాల్లో పంటలు ఎండి పోతున్నాయి.రైతులు అరిగోసపడుతున్నారు. ఈ కరువుకు కాంగ్రెస్ కారణం. నీటి సమస్య కరెంటు సమస్యలకు కారణం కాంగ్రెస్. ఆరు గ్యారెంటీల్లో ఒక్క హామీని కూడా సరిగ్గా అమలు చేయలేదు’’ అని కేసీఆర్ ఫైర్ అయ్యారు.
దేవుడిపై ఒట్లు ఎందుకు...?
‘‘ఫ్రీ బస్సు పథకం సంతోషమే కానీ దాని వల్ల ఆటో డ్రైవర్లు చనిపోతుంటే పట్టించు కోవడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి ఏ ఊరికి వెళ్లే అక్కడి దేవుడి మీద ఒట్టు పెడుతున్నారు. ఎవరైనా పని చేసే వాడు దేవుడిపై ఒట్లు పెట్టు కుంటాడా. డిసెంబర్ లోనే రూ.2లక్షల రుణమాఫీ ఏమైంది. ఎన్నికల్లో ప్రజలు ఆగమాగం అయి ఓటేయద్దు. ఒక భయంకరమైన కుట్ర జరగబోతోంది. బొగ్గు గనులను ప్రైవేటు పరం చేసి సింగరేణి కార్మికుల కు అన్యాయం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. సీపీఐ -సీపీఎం నాయకులు ధైర్యం ఉంటే జవాబు చెప్పాలి. నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తెచ్చింది ఎవరు. వారసత్వ ఉద్యోగాలను పునరుద్దరించింది ఎవరో చెప్పాలి’’ అని కేసీఆర్ అన్నారు.
Read Latest Telangana News And Telugu News