Home » Elections
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ పోలింగ్ అనంతరం కూడా వైసీపీ మూకలు కొనసాగించిన ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో ఒక దారుణం వెలుగుచూసింది. ఎన్నికల్లో కూటమికి ఓటు వేశామని చెప్పిన ఓ కుటుంబంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ మేరకు బాధితులు సుంకర ధనలక్ష్మి, ఆమె కుమార్తె నూకరత్నం, కుమారుడు మణికంఠ మీడియా వేదికగా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా, పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యులైన అధికారులపై సంచలన చర్యలు తీసుకుంది.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో చెలరేగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి గురువారం వ్యక్తిగత వివరణ ఇచ్చారు. సుమారు అరగంట పాటు సీఎస్, డీజీపీ వివరణ ఇచ్చారు. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ -ఆఫీస్ అప్ గ్రేడ్ వ్యవహారాన్ని నిలిపివేయాలని కోరారు. ఈ నెల 17 నుంచి 25 వరకు అప్‌గ్రేడ్ పేరుతో ఈ-ఆఫీస్ మూసివేతపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు పేర్కొన్నారు.
జవహర్ రెడ్డి, హరీష్ కుమార్ గుప్తా ఇద్దరూ నేడు (గురువారం) ఢిల్లీ వెళ్లి ఎన్నికల కమిషన్ ముందు హాజరయ్యారు. పోలింగ్ మరుసటి రోజు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు, హింసాత్మక ఘటనలపై ఈసీకి అధికారులు వివరణ ఇస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా రాయ్ బరేలికి క్యూ కట్టారు. రాహుల్ గాంధీ రాయ్ బరేలి నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. రేపు లేదా ఎల్లుండి రాయ్ బరేలిలో ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. తెలంగాణ ఎన్నికలు ముగిసినందున రాయ్ బరేలిలో ప్రచారానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లారు.
చెదురమదురు హింసాత్మక ఘటనల మధ్య ఏపీ అసెంబ్లీ ఎన్నికలు గత సోమవారం ముగిశాయి. ఓటరు మహాశయుల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అయితే గెలుపుపై అటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌తో పాటు ఇటు కూటమి పార్టీలు కూడా దీమా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ఎన్నికల అనంతరం కూడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటుండడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీలకు ఎన్నికల కమిషన్ సమ్మన్లు జారీ చేసింది.
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గంగా సప్తమి పర్వదినాన.. ప్రధాని మోదీ వారాణసీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ సహా పలువురు ఎన్డీయే కూటమి నేతలు తదితర అతిరథమహారథులు వెంటరాగా..
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. పంద్రాగస్టులోగా