Home » National
ఈశాన్య ఢిల్లీలోని సుందర్ నగ్రిలో గత వారం హత్యకు గురైన 28 ఏళ్ల యువకుడి కుటుంబాన్ని ముఖ్యమంత్రి పరామర్శించారు. అనంతరం ఆమె ఢిల్లీలోని శాంతిభద్రతల పరిస్థితిపై మీడియాతో మాట్లాడారు. హతుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా, జార్ఖాండ్‌లో రెండో విడతగా 38 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడతాయి.
ఎన్నికల స్వేచ్ఛగా, సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి, ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఫిర్యాదులు అందిన తక్షణమే చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో తెలియజేయాలని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు
ఒడిశాలోని వివిధ జిల్లాల్లో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత సవ్యసాచి పాండ తీవ్ర అలజడి సృష్టించారు. ఈ నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది.
రెజ్లింగ్ స్టార్ కు రింగులోనే గుండు గీకిన ట్రంప్ ఆ తర్వాత తన పంతం నెగ్గించుకున్నాడు. ఇప్పుడదే కుటుంబానికి కీలక పదవులు ఇచ్చాడు.
ఈడీ చార్జిషీటును పరిగణనలోకి తీసుకుని విచారణకు ట్రయిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడాన్ని చిదంబరం హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై సింగిల్ జడ్జి తాజా ఆదేశాలు జారీ చేస్తూ, చిదంబర పిటిషన్‌పై స్పందించాలని ఈడీని ఆదేశించారు. తదుపరి విచారణను 2025 జనవరికి వాయిదా వేశారు.
అరవైయేళ్ల బామ్మ మృతదేహానికి అంత్యక్రియలు జరుపుతుండగా ఉన్నట్టుండి ఆమె పైకి లేచి కళ్లు తెరవటంతో బంధువులంతా భయంతో పరుగులు తీశారు. తిరుచ్చి(Tiruchi) జిల్లాలో కలకలం రేపిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
సినీనటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో ఇప్పటివరకు పొత్తు గురించి చర్చించలేదని, పొత్తుపై వస్తున్న వదంతులు నమ్మరాదని అన్నాడీఎంకే మాజీ మంత్రి డి.జయకుమార్(Former AIADMK Minister D. Jayakumar) పేర్కొన్నారు.
ప్రముఖ సినీనటుడు విజయ్(Vijay) నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం (టీవీకే)కు రాష్ట్రవ్యాప్తంగా ఏ మేరకు మద్దతు లభిస్తోందన్న వ్యవహారంపై రాష్ట్ర ఇంటెలిజెన్స్(State Intelligence) విభాగం ఆరా తీ స్తోంది. శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇటీవల విక్రవాండిలో నిర్వహించిన టీవీకే తొలి మహానాడుకు ఐదు లక్షలమందికిపైగా జనసమీకరణ ఎలా సాధ్యమైందనే విషయమై ఇంటెలిజెన్స్ అధికారులు వివరాలు రాబడుతున్నారు.
ఢిల్లీలో కాలుష్య స్థాయిలు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి. ఈ ఉదయం AQI స్థాయి 450కిపైగా నమోదైంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న కాలుష్య స్థాయికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 50% ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని నిర్ణయించింది.