Former Minister: నటుడు విజయ్ పార్టీతో పొత్తుకోసం ఇంకా చర్చించలేదు
ABN , Publish Date - Nov 20 , 2024 | 01:23 PM
సినీనటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో ఇప్పటివరకు పొత్తు గురించి చర్చించలేదని, పొత్తుపై వస్తున్న వదంతులు నమ్మరాదని అన్నాడీఎంకే మాజీ మంత్రి డి.జయకుమార్(Former AIADMK Minister D. Jayakumar) పేర్కొన్నారు.
- మాజీ మంత్రి డి.జయకుమార్
చెన్నై: సినీనటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో ఇప్పటివరకు పొత్తు గురించి చర్చించలేదని, పొత్తుపై వస్తున్న వదంతులు నమ్మరాదని అన్నాడీఎంకే మాజీ మంత్రి డి.జయకుమార్(Former AIADMK Minister D. Jayakumar) పేర్కొన్నారు. రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మతవాదం ప్రోత్సహించే పార్టీలతో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు కుదుర్చుకోమని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) ఇంతకు ముందే స్పష్టంగా అభిప్రాయం తెలియజేశారని,
ఈ వార్తను కూడా చదవండి: TVK: టీవీకే పార్టీపై ఇంటెలిజెన్స్ నిఘా..
డీఎంకే(DMK)ను వ్యతిరేకించే పార్టీలు అన్నాడీఎంకే కూటమిలోకి రావచ్చని ఆయన ఆహ్వానించారని తెలిపారు. అయితే, కూటమికి సంబంధించి కొన్ని ప్రాంతీయ పార్టీలతో అన్నాడీఎంకే చర్చలు సాగిస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మరాదన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, పొత్తుపై ఈపీఎస్ నిర్ణయం తీసుకుంటారని జయకుమార్ తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: శబరిమలకు 18 ప్రత్యేక రైళ్లు
ఈవార్తను కూడా చదవండి: చేసింది చెప్పలేక కేసీఆర్ను తిడతావా..
ఈవార్తను కూడా చదవండి: మళ్లీ పుంజుకున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
ఈవార్తను కూడా చదవండి: సగం పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాల్లేవు
Read Latest Telangana News and National News