Home » Navya » Nivedana
‘‘అంతర్యామిని, పరమాత్మను అయిన నాలోనే నీ చిత్తాన్ని ఉంచి, కర్మలన్నిటినీ నాకే అర్పించి, జ్వర (దుఃఖాన్ని), ఆశా, మమతా, సంతాపాలను వదిలి యుద్ధం చెయ్యి’’ అని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. భగవద్గీతలోని ఈ ఉపదేశ సారాంశం... రోజువారీ జీవితంలో మనకు ఎదురయ్యే సందేహాలకు సమాధానం ఇస్తుంది.
మన దేశాన్ని పాలించిన మహమ్మద్ నజీరుద్దీన్ సద్గుణ సంపన్నుడిగా, నిరాడంబరుడిగా పేరు పొందాడు. ప్రభుత్వ ధనాగారం మీద సర్వాధికారం ఉన్నప్పటికీ... తన సొంత పోషణ కోసం చిల్లిగవ్వ కూడా తీసుకొనేవాడు కాదు. మరి విశాలమైన రాజ్యాన్ని పాలించే ఆయనకు తన అవసరాలు తీర్చుకోవడానికి ఆదాయం ఎలా?
ఒక జత చెప్పులు దానం చేయడం వల్ల శనిదేవుని దయ లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఆత్మ సాక్షాత్కార సాధనను సుగమం చేయాలనే ఆకాంక్ష శ్రీమాతాజీ నిర్మలాదేవిలో తలెత్తడానికి కారణం... ప్రపంచవ్యాప్తంగా ఆమె గమనించిన అస్తవ్యస్త పరిస్థితులే. తన చుట్టుపక్కల వ్యక్తులు వ్యక్తిగతంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న కష్టాలను ఆమె గమనించారు.
ఒక కాయ దాని తల్లి చెట్టు నుంచి పోషకాలు గ్రహిస్తూ వృద్ధి చెందుతుంది. తరువాత అది తన సొంత ప్రయాణాన్ని ప్రారంభించడానికి చెట్టు నుంచి వేరుపడుతుంది.
మానవత్వం అంటే మనిషిని మనిషిగా గౌరవించడం మాత్రమే కాదు... సమస్త జీవులనూ, ప్రకృతినీ ప్రేమించడం. హింసకూ, విధ్వంసాలకూ దూరంగా ఉండడం.
ఏసు క్రీస్తు స్వభావంపై అనేక రకాల సందేహాలు ఉన్నాయి. ‘ఆయన దేవుడి పుత్రుడేనా? కాదా?’ అనేది కొందరి సందేహం. ‘ఇంతకీ ఆయన ఎవరు?’ అనే ప్రశ్నకు ‘‘ఆయన ఒక పరిపూర్ణమైన మానవుడు. ఆయన దేవుడు కాదు’’ అనేది కొందరు చెప్పే సమాధానం.
సంకల్ప శుద్ధితో చేసిన దానం ఎంతో విలువైనది. చిత్తశుద్ధితో చేసే సదఖా ఎంతో అమూల్యమైనది. రంజాన్ మాసంలోనే కాకుండా... ఇతర మాసాలలో కూడా సదఖా చేస్తూనే ఉండాలి.
సౌందర్యము అంటే మనసుకు ఆనందం కలిగించేది. లహరి అంటే అలలు. మన మనసుకు ఆనందం కలిగించే అలలలాంటి ఆణిముత్యాలతో కూడినది శ్రీ ఆదిశంకరాచార్యులవారు రచించిన సౌందర్యలహరి.
ఇతరులకు మంచి జరుగుతుందని అనుకుంటే... వారికి ఉపకారం చెయ్యడం కోసం అవసరమైతే తమ పనులను కూడా మానుకొనేవారు ఉత్తములు.