Home » NRI » Gulf lekha
కరోనా తరహా మహమ్మారులను నిర్మూలించే వాక్సిన్ల అందుబాటు విషయంలో ఇప్పటివరకూ అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఉంది. వాక్సిన్ విషయంలో సంపన్న దేశాల దయాదాక్షిణ్యాలపై పేద దేశాలు ఆధారపడకుండా ఉండడానికి భారత్ చొరవ తీసుకుని నాయకత్వం వహించాలి.
పాలస్తీనా భూభాగాలను తమ దేశంలో కలుపుకోబోమంటూ ఇజ్రాయిల్ ఇచ్చిన హామీ మేరకు ఆ దేశంతో సంబంధాలను నెలకొల్పుకునే దిశగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ ముందడుగు వేసింది. ఒమాన్, ఖతర్ దేశాలతో పాటు బహ్రెయిన్ సైతం యు.ఏ.ఇ బాటన ఇజ్రాయిల్ తో సంబంధాలను నెలకొల్పుకునే ఆవకాశాలున్నాయి.
కరోనా కాటుతో ఉద్యోగాలు కోల్పోయి స్వదేశానికి తిరిగి వచ్చే భారతీయుల సంఖ్యను అంచనా వేయడంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలూ విఫలమయ్యాయి. ప్రవాసులను తీసుకురావడానికి ఉద్దేశించిన ‘మిషన్ వందే భారత్’ క్రింద దశల వారీగా నడుపుతున్న విమానాల సంఖ్య ప్రయాణీకుల సంఖ్యకు తగినట్లుగా లేదు.
ఏ విధంగా చూసినా, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో గల్ఫ్ ప్రవాసుల పాత్రను విస్మరించలేము. మాతృదేశ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తున్న ఈ ప్రవాసులకు దురదృష్టవశాత్తు ఇటు గల్ఫ్‌లో గానీ అటు స్వదేశంలో గానీ సరైన గుర్తింపు లభించడం లేదు.
అలీ బాబ తదితర చైనీయ వాణిజ్య సంస్థల కార్పొరేట్ నీతికి తోడుగా బీజింగ్ పాలకుల వ్యూహాత్మక
కరోనా గురించి మాట్లాడుతున్న భారతదేశ పాలకులు ప్రజల ఆకలి కేకల్ని ఆలకిస్తున్నారా? భారత ఆహార సంస్థ గిడ్డంగులలో 7.7 కోట్ల టన్నుల తిండి గింజల నిల్వలు ఉన్నా పంపిణీ చేయడానికి పాలకులకు మనస్సు లేకపోవడం బాధకరం. కార్పొరేటు కుబేరులకు లక్షల కోట్ల రూపాయల బాకీలు మాఫీ చేసే సర్కారు పేదలకు కేవలం కిలో పప్పు , ఐదు కిలోల బియ్యం..
కువైత్‌లోని కడప, చిత్తూరు జిల్లాల; బహ్రెయిన్ లోని కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల ప్రవాసుల ఆర్థిక జీవనాన్ని కరోనా వ్యాధి అతలాకుతలం చేసింది. సౌదీ అరేబియా, బహ్రెయిన్‌ల మధ్య రోడ్డు మార్గంపై రాకపోకలను నిషేధించడంతో సేవల రంగంలో జీవనోపాధి పొందుతున్న తెలంగాణ ప్రవాసులు అనేక మంది వీధుల పాలయ్యారు.
న్యూఢిల్లీలో మార్చి 13–15 తేదీల్లో తబ్లీఘ్ జమాత్ నిర్వహించిన మత సమ్మేళనంలో పాల్గొన్న అనేక మందికి కరోనా వైరస్ సంక్రమించడంతో పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నది.
గల్ఫ్ దేశాలలో రాత్రివేళలలో జన సంచారం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా కువైత్ సాయంకాలం అయిదు నుంచి తెల్లవారు జాము దాకా, సౌదీ అరేబియా రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరు వరకు కర్ఫ్యూను అమలు పరుస్తున్నాయి. కర్ఫ్యూ వేళలలో ఇళ్ళ నుండి బయటకు వచ్చిన ప్రతి వ్యక్తిని పోలీసులు నిర్బంధిస్తున్నారు.