Home » 2024 Lok Sabha Elections
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల పోలింగ్ ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో గల అరకు, రంపచోడవరం పాడేరు నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది.
ఏపీలో ఎన్నికలు జరుగుతున్న వేళ.. వైసీపీ తన దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తోంది. అధికార మదం, ఓటమి భయంతో.. పోలింగ్ కేంద్రాల వద్ద నానా రాద్ధాంతం చేస్తోంది. ఓటింగ్ సజావుగా సాగకుండా..
ఏపీలో జోరుగా కొనసాగుతున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో (AP Elections 2024) భాగంగా.. 50 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటలకు 55.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు వేసేందుకు వయోజనులు ఉదయమే పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఎన్నికల సంఘం ప్రజలకు పిలుపునిచ్చింది. ఓటు హక్కు విధిగా ఉపయోగించుకోవాలని సెలబ్రిటీలు కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడం తప్ప పోలింగ్ కూల్‌గా సాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రలో సతీ సమేతంగా ఓటు వేశారు.
దేశవ్యాప్తంగా నాలుగో విడత లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గల 17 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మెదక్ లోక్ సభ సెగ్మెంట్‌లో గల పటాన్ చెరులో ఓ పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంపిణీ చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తుంటారు. పోలింగ్ జరిగే సమయంలో కొందరు అభ్యర్థులు టెన్షన్‌కు గురి అవుతుంటారు. స్వతంత్ర్య అభ్యర్థులను క్రాస్ ఓటింగ్ సమస్య వణికిస్తోంది. తమ లాంటి గుర్తు మరో అభ్యర్థికి కేటాయిస్తే ఓటరు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఒకరికి వేసే ఓటు మరొకరి వేస్తారు. అలా ఎక్కువ మంది గందరగోళానికి గురయితే గెలిచే అభ్యర్థి ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి.
గత పదేళ్ల నుంచి చేసిన పనులే తిరిగి తమ ప్రభుత్వం ఏర్పడేందుకు దోహద పడుతుందని ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు. గత 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో అభివృద్ధి పడకేసింది. గత పదేళ్లలో దేశం ఎంతో ప్రగతి సాధించిందని వివరించారు.
లోక్ సభ ఎన్నిక నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి తెలంగాణ రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. నలుగురు కన్నా ఎక్కువ మంది గుమిగూడొద్దని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఆరు గంటల నుంచి ప్రచారం చేయొద్దని తేల్చి చెప్పారు.
ప్రధాని మోదీపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం తనను చూసి నేర్చుకోవాలని సూచించారు. తన క్యాబినెట్ మంత్రిపై ఆరోపణలు వస్తే జైల్లో వేశానని గుర్తుచేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నని చెబుతూనే దొంగలను పార్టీలో చేర్చుకుంటున్నారని కేజ్రీవాల్ విమర్శించారు.