Share News

AP Elections 2024: తిరుపతిలో వైసీపీ దౌర్జన్యం.. దొంగ ఓట్లు వేయిస్తున్న వైనం

ABN , Publish Date - May 13 , 2024 | 04:37 PM

ఏపీలో ఎన్నికలు జరుగుతున్న వేళ.. వైసీపీ తన దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తోంది. అధికార మదం, ఓటమి భయంతో.. పోలింగ్ కేంద్రాల వద్ద నానా రాద్ధాంతం చేస్తోంది. ఓటింగ్ సజావుగా సాగకుండా..

AP Elections 2024: తిరుపతిలో వైసీపీ దౌర్జన్యం.. దొంగ ఓట్లు వేయిస్తున్న వైనం

ఏపీలో ఎన్నికలు (AP Elections 2024) జరుగుతున్న వేళ.. వైసీపీ (YSRCP) తన దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తోంది. అధికార మదం, ఓటమి భయంతో.. పోలింగ్ కేంద్రాల (Polling Booths) వద్ద నానా రాద్ధాంతం చేస్తోంది. ఓటింగ్ సజావుగా సాగకుండా అడ్డంకులు సృష్టిస్తోంది. అంతేకాదు.. కొన్ని ప్రాంతాల్లో తమకే ఓటు వేయాలని ఓటర్లను ప్రలోభ పెట్టడంతో పాటు సెలైంట్‌గా దొంగ ఓట్లు (YSRCP Fake Votes) కూడా వేయిస్తోంది. ఈ పరిణామం తిరుపతిలో వెలుగుచూసింది. మహిళలకు మంచి దుస్తులు ఇచ్చి, వారిని కారులో ఎక్కించుకొని వచ్చి, దొంగ ఓట్లు వేయిస్తున్నారని తెలిసింది.


షిఫ్టెడ్, అన్‌ట్రేస్డ్ ఉన్న ఏఎస్‌డీ లిస్టును పోలింగ్ ఏజెంట్లకు ఇవ్వకుండా.. కొన్ని బూతుల్లోని పోలింగ్ సిబ్బంది రహస్యంగా పెడుతోంది. పోలింగ్‌కి ముందు రోజు రాత్రే మాస్టర్ ప్లాన్స్ వేసుకున్న వైసీపీ.. కొందరు సిబ్బందిని కొనుగోలు చేసింది. ఆ సిబ్బంది ఉన్న బూతుల్లో రహస్యంగా ఓట్లు వేయిస్తోంది. వెబ్ కాస్టింగ్‌లో దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటూ.. ఒక్కో బూతుకి ఒక్క రంగు చీరతో మహిళలను వైసీపీ కార్యకర్తలు తీసుకుపోతున్నారు. ఏఎస్‌డీ లిస్టులో ఉన్న ఓట్లను.. ఖరీదైన చీరలు కట్టుకొచ్చిన మహిళల ద్వారా ఈ దొంగ ఓట్లు వేయిస్తోంది. ఈ వ్యవహారంపై స్థానికంగా తీవ్ర దుమారం రేగుతోంది.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 13 , 2024 | 04:37 PM