AP Elections 2024: ఏపీలో 50% పైగా పోలింగ్ నమోదు.. ఏయే జిల్లాల్లో ఎంతంటే?
ABN , Publish Date - May 13 , 2024 | 03:58 PM
ఏపీలో జోరుగా కొనసాగుతున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో (AP Elections 2024) భాగంగా.. 50 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటలకు 55.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి.
ఏపీలో జోరుగా కొనసాగుతున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో (AP Elections 2024) భాగంగా.. 50 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటలకు 55.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు 2 గంటలకే పోలింగ్ శాతం హాఫ్ సెంచరీ దాటేసినట్లు తేలింది. ఈసారి ప్రజలు ఉత్సాహంగా ఓటు వేయడానికి వస్తుండటంతోనే.. రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదు అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో దాడులు జరిగినా, గందరగోళ వాతావరణం నెలకొన్నా.. పోలింగ్‌పై వాటి ప్రభావం కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో ఓటేసేందుకు ఓటర్లు పోటెత్తుతున్నారు. పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నా.. లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వస్తున్నారు.
జిల్లాల వారీగా నమోదైన పోలింగ్
ASR మన్యం: 48.87
అనకాపల్లి: 53.45
అనంతపురం: 54.25
అన్నమయ్య: 54.44
బాపట్ల: 59.49
చిత్తూరు: 61.94
కోనసీమ: 59.73
తూర్పు గోదావరి: 52.32
ఏలూరు: 57.11
గుంటూరు: 52.24
కాకినాడ: 52.69
కృష్ణా: 59.39
కర్నూలు: 52.26
నంద్యాల: 59.30
ఎన్‌టీఆర్: 55.71
పల్నాడు: 56.48
పార్వతిపురం: 51.75
ప్రకాశం: 59.96
PSMR నెల్లూరు: 58.14
శ్రీసత్యసాయి: 57.56
శ్రీకాకుళం: 54.87
తిరుపతి: 54.42
విశాఖపట్నం: 46.01
విజయనగరం: 54.31
పశ్చిమ గోదావరి: 54.60
కడప: 60.57