Home » aap party
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు(Arvind Kejriwal Arrest)కు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వెలుపల, ITO వద్ద నిరసన చేస్తున్న ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్(Saurabh Bharadwaj), అతిషి(atishi) సహా పలువురు ఆప్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేజ్రీవాల్ (Kejriwal) అరెస్ట్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమర్థిస్తుండగా.. ప్రతిపక్షాలు రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. మొదటి దశ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వేళ కేజ్రీవాల్ అరెస్ట్ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఏ విధంగా ఉంటుందనే చర్చ నడుస్తోంది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు(arvind Kejriwal arrest) చేయడంపై, రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్(Kapil Sibal) స్పందించారు. ఏం చేయాలో భారత కూటమి వెంటనే నిర్ణయించాలని అన్నారు. ఈ క్రమంలోనేఅరవింద్ కేజ్రీవాల్‌ను ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు రోస్ అవెన్యూ కోర్టు(rose avenue court)లో హాజరుపర్చనున్నారు.
అవినీతికి వ్యతిరేకంగా.. సుపరిపాలన అందిచడమే లక్ష్యంగా.. అన్నాహజారే ఉద్యమంలోంచి పుట్టిన పార్టీ. అతి తక్కువ సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దేశం మొత్తం పార్టీని విస్తరించేందుకు ఆప్ అధినేత కేజ్రీవాల్ అడుగులు వేస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌తో బీజేపీ, ఆప్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆప్ నేతలు బీజేపీ(BJP)ని టార్గెట్ చేశారు. ఎన్నికల యుద్ధంగా నేరుగా ఎదుర్కోలేక, దర్యాప్తు సంస్థలతో దాడులకు పాల్పడు తోందని ఆప్ ఆరోపిస్తోంది. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. కేజ్రీవాల్ (Kejriwal) అరెస్ట్ రాజకీయ దుమారాన్ని రేపుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలిపారు. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన రాహుల్.. అధైర్యపడొద్దని, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఆమాద్మీ పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆప్ నేతలు గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్, సందీప్ పాఠక్, అతిషి మర్లీనా వెల్లడించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి(delhi CM) అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) అరెస్ట్ తర్వాత ఢిల్లీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారా లేదా కొత్త సీఎంగా ఎవరినైనా ఎంపిక చేస్తారా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణకు రావాలంటూ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) కు ఈడీ తొమ్మిదో సారి సమన్లు జారీ చేసింది. దీనిని తీవ్రంగా తీసుకున్న ఆప్ అధినేత హైకోర్టును ఆశ్రయించారు. తనకు జారీ చేసిన అనేక సమన్లను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
పొరుగు దేశాల నుంచి ఇండియాలో శరణార్థులుగా ఉంటున్న వారు దేశ రాజధాని దిల్లీలో చేసిన నిరసనలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా జైలులో ఉండాల్సి వారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.