Viral Video: ఢిల్లీ వరదలపై బీజేపీ కౌన్సిలర్ వినూత్న నిరసన..
ABN , Publish Date - Jun 28 , 2024 | 05:27 PM
ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు వినూత్నంగా నిరసన తెలపడం సహజమే. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ బీజేపీ(BJP) నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. గత రెండు రోజులుగా దేశ రాజధానికి వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో రోడ్లపై మోకాళ్ల ఎత్తులో వర్షపు నీరు నిలిచింది.
ఢిల్లీ: ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు వినూత్నంగా నిరసన తెలపడం సహజమే. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ బీజేపీ(BJP) నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. గత రెండు రోజులుగా దేశ రాజధానికి వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో రోడ్లపై మోకాళ్ల ఎత్తులో వర్షపు నీరు నిలిచింది. వరదలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
దీంతో బీజేపీ కౌన్సిలర్ రవీందర్ సింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్నంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. వరదల్లో ఓ చిన్న పడవ నడుపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశ రాజధానిలో సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థే లేదని, కేజ్రీ సర్కార్ మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు."అన్ని మురుగు కాలువలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాకాలం ముందు వాటిని శుభ్రం చేయలేదు. ఒకవైపు వరదలు ముంచెత్తుతుంటే ఇంకోవైపు తాగు నీటి సమస్య తలెత్తుతోంది" అని రవీందర్ సింగ్ అన్నారు.
భారీ వర్షాలు..
ఢిల్లీ - ఎన్‌సీఆర్ పరిధిలో శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఢిల్లీ విమానాశ్రయ టెర్మినల్ - 1పైకప్పు కొంత భాగం కూలిపోయింది. ధౌలా కువాన్ ఫ్లైఓవర్ కింద నీరు నిలిచిన కారణంగా నరైనా నుండి మోతీ బాగ్, వైస్ వెర్సా వైపు ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షాల కారణంగా యశోభూమి ద్వారకా సెక్టార్ - 25 మెట్రో స్టేషన్ మూసేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది.
For Latest News and Tech News click here..