Share News

Heavy Rains: వారికి రూ.10 లక్షల పరిహారం.. ప్రకటించిన ఢిల్లీ సర్కార్

ABN , Publish Date - Jun 30 , 2024 | 08:45 PM

దేశ రాజధాని ఢిల్లీని గత 5 రోజులుగా భారీ వర్షాలు(Heavy Rains) వణికిస్తున్నాయి. వరదల్లో కొట్టుకుపోయి 11 మందికిపైగా మృతి చెందారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని కేజ్రీవాల్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Heavy Rains: వారికి రూ.10 లక్షల పరిహారం.. ప్రకటించిన ఢిల్లీ సర్కార్

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని గత 5 రోజులుగా భారీ వర్షాలు(Heavy Rains) వణికిస్తున్నాయి. వరదల్లో కొట్టుకుపోయి 11 మందికిపైగా మృతి చెందారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని కేజ్రీవాల్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం(Compensation) ప్రకటించింది. ఈ మేరకు మంత్రి అతిషి రెవెన్యూ శాఖకు సమాచారం అందించారు.


వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారందరి కుటుంబాలకు రూ.10లక్షలు పరిహారంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు అతిషి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆసుపత్రులు, పోలీసుల సాయంతో ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలను గుర్తించాలని ఆదేశించారు. జీఎన్సీటీడీ తరఫున వారికి పరిహారాన్ని వెంటనే అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆప్తులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు పరిహారం ఆర్థికంగా సాయపడుతుందని అతిషి పేర్కొన్నారు.

For Latest News and National News click here

Updated Date - Jun 30 , 2024 | 08:46 PM