Home » aap party
ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) మోదీ(modi) పేరు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో మీ భర్తలు మోదీ పేరు తలిస్తే వారికి రాత్రి పూట భోజనం పెట్టొద్దని వ్యాఖ్యానించారు.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మహిళలందరినీ తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు అదిరిపోయే స్కెచ్ వేసింది. ఈ క్రమంలోనే ఇవాళ ఢిల్లీలో ప్రతి మహిళకు రూ.1000 ప్రకటించింది. అసెంబ్లీలో నేడు బడ్జెట్‌ను కేజ్రీవాల్ సర్కార్ ప్రవేశ పెట్టింది. ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మహిళా ఓట్ల కోసం తాయిలాన్ని ప్రకటించింది.
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపినందుకు తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకవైపు పంజాబ్‌లో సొంతంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సిద్ధమవుతూనే మరోవైపు ఢిల్లీలో ఎంపీ సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఫార్ములా ఖారురు చేసింది.
INDIA Alliance: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమికి ఆదిలోనే వరుస ఎదురుదెబ్బలకు తగులుతున్నాయి. అసలు ఈ కూటమి ఉంటుందా? ఊడుతుందా? అన్న పరిస్థితి ఏర్పడింది. ఉత్తరప్రదేశ్‌లో జయంత్ చౌదరి.. పంజాబ్‌లో భగవంత్ మాన్.. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా.. ఇండియా కూటమికి బిగ్ షాక్ ఇచ్చారు.
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు దిల్లీ క్రైమ్ బ్రాంచ్ టీమ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సిబ్బంది వివరాలు వెల్లడించింది.
హర్యానా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నిర్మల్ సింగ్ మోహ్రా, చిత్ర సర్వారా కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానా కాంగ్రెస్ ఇన్చార్జ్ దీపక్ బబారియా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాన్ సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
మరికొన్ని రోజుల్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థిగా ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) మాజీ చైర్పర్సన్ స్వాతి మలివాల్(Swati Maliwal)ను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) శుక్రవారం నామినేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె తన పదవికి రాజీనామా చేయగా..అక్కడి సిబ్బంది బావోద్వేగానికి లోనయ్యారు.
శిరోమణి అకాలీదళ్ పై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్లు అధికారంలో ఉన్నఅకాలీదళ్.. కనికరం లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేసిందని మండి పడ్డారు.
ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) వార్షికోత్సవం సందర్భంగా వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న నేతలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) గుర్తు చేసుకున్నారు. ఇవాళ ఆ పార్టీ 11వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేశారు.