Lok Sabha Elections: జైలు నుంచే కేజ్రీవాల్ ఎన్నికల వ్యూహాలు..
ABN , Publish Date - May 08 , 2024 | 12:47 PM
పార్టీ స్థాపించి అతితక్కువ కాలంలోనే ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది ఆప్. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలకు సంబంధించిన కేసులో తిహార్ జైల్లో ఉన్నారు. ఎన్నికలలో వినూత్నంగా ప్రచారం చేసి.. సక్సెస్ సాధించడంలో అరవింద్ కేజ్రీవాల్ ముందువరుసలో ఉంటారు. ఢిల్లీలో కేజ్రీవాల్ అధికారంలోకి రావడానికి ఆయన ప్రచార వ్యూహం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ప్రజలందరినీ ఆకర్షించేలా ప్రచారం చేయడంలో ఆయన ముందుంటారు.
పార్టీ స్థాపించి అతితక్కువ కాలంలోనే ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది ఆప్. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలకు సంబంధించిన కేసులో తిహార్ జైల్లో ఉన్నారు. ఎన్నికలలో వినూత్నంగా ప్రచారం చేసి.. సక్సెస్ సాధించడంలో అరవింద్ కేజ్రీవాల్ ముందువరుసలో ఉంటారు. ఢిల్లీలో కేజ్రీవాల్ అధికారంలోకి రావడానికి ఆయన ప్రచార వ్యూహం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ప్రజలందరినీ ఆకర్షించేలా ప్రచారం చేయడంలో ఆయన ముందుంటారు. కేజ్రీవాల్ తనవైపు ప్రజల దృష్టిని ఆకర్షించుకోవడంలో ఫస్ట్‌లైన్‌లో ఉంటారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉండటంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోతున్నారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ ఆప్ తరపున ప్రచారం చేస్తున్నారు. మరోవైపు దేశప్రజలను ఆకర్షించేలా కేజ్రీవాల్ జైలు నుంచే వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీలో ఢిల్లీ, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కేజ్రీవాల్ వ్యూహ్యాం బయటపడినట్లు తెలుస్తోంది.
Patna: ముస్లింలందరికీ రిజర్వేషన్లు ఉండాలి
ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆప్ కార్యకర్తలు స్టేడియం ముందు నినాదాలు చేశారు. మ్యాచ్‌లో నినాదాలు చేసినందుకు పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులను ఢిల్లీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. స్టేడియంలో న్యూసెన్స్ చేయడం ద్వారా ఇతర ప్రేక్షకులను ఇబ్బంది పెట్టినందుకుగానూ ఆప్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆప్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఐపీఎల్ మ్యాచ్‌లో నిరసన తెలిపిన వీడియోను పోస్ట్ చేసింది. అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా భారత్ మాతా కీ జ అంటూ నినాదాలు చేశారు. ఆప్ మద్దతుదారులు కటకటాల వెనుక అరవింద్ కేజ్రీవాల్ ఉన్న ఫోటోతో పాటు "జైల్ కా జవాబ్ వోట్ సే" అనే నినాదంతో కూడిన టీ-షర్టులు ధరించారు. ఆప్ విద్యార్థి విభాగం ఛత్ర యువ సంఘర్ష్ సమితి (సివైఎస్ఎస్) ఈ నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు వేలాది మంది క్రికెట్ అభిమానులు వస్తుంటారు. అలాగే కోట్లాది మంది టీవీల్లో చూస్తూ ఉంటారు. ఐపీఎల్ మ్యాచ్‌లో కేసీఆర్‌కు మద్దతుగా నిరసన ప్రదర్శన చేస్తే దేశం దృష్టిని ఆకర్షించవచ్చనే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో కేజ్రీవాల్ మరో వారం రోజుల్లో బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మధ్యంతర బెయిల్ న్యాయస్థానం ఇవ్వకపోతే జైలు నుంచి ఎలాంటి వ్యూహాలను అమలుచేస్తారో చూడాల్సి ఉంది.
AIMIM: పది లోక్‌సభ స్థానాల్లో మజ్లిస్ పోటీ
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest National News and Telugu News