Home » ABN
మరికొద్ది రోజుల్లో జరగబోయే లోక్ సభ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థుల ప్రకటనలో బిజీగా మారాయి. ఎలాగైనా సరే అధికారం చేపట్టాలని భావిస్తున్న ఇండియా కూటమి ఓ వైపు.. మూడో సారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ మరోవైపు పావులు కదుపుతున్నాయి.
హోలీ పండుగ వేళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెను విషాదం నెలకొంది. కొమరం భీం ( Komaram Bheem ) జిల్లా తాటిపల్లి వద్ద వార్దా నదిలో స్నానానికి దిగిన నలుగురు యువకులు నదిలో గల్లంతయ్యారు. లోతు సరిగా అంచనావేయకపోవడం వల్ల ఒక్కొక్కరుగా మునిగిపోయారు.
దేశవ్యాప్తంగా హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్న తరుణంలో ఆప్ నేత అతిశీ కీలక ప్రకటన చేశారు. దిల్లీ మద్యం కేసులో తమ నాయకుడు కేజ్రీవాల్ ( Kejriwal ) ను అన్యాయంగా ఈడీ అరెస్టు చేసిందని ఆరోపించారు. ఈ కారణంగా తాము హోలీ ఆడలేకపోతున్నట్లు తెలిపారు.
గంధపు చెక్కల స్మగ్లర్, బందిపోటు వీరప్పన్ కుమార్తె లోక్ సభ ఎన్నికల బరిలోకి నిలిచారు. కొద్ది రోజుల క్రితమే బీజేపీకి రాజీనామా చేసిన విద్యారాణి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని కృష్ణగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. నామ్ తమిళర్ కట్చి టికెట్‌పై పోటీ చేయనున్నట్లు తెలిపారు.
చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం, సాధించాలనే దృఢ సంకల్పం, గుండెల నిండా ధైర్యం ఉంటే చాలు.. సుదూర కొండలు సైతం పాదాక్రాంతం అవుతాయి. కొందరికి అన్నీ బాగున్నా ఇంకా ఏదో కావాలనుకుంటూ నిరంతరం నిరాశతో బతుకుతుంటారు.
లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఇండియా బ్లాక్ కూటమి ముక్తకంఠంతో ఖండించింది. అరెస్ట్‌ను నిరసిస్తూ ఈ నెల 31వ తేదీన ఆదివారం నాడు మెగా ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెర తీస్తున్నారు. భారీగా నగదు తరలిస్తున్నారు. కార్లలో తరలిస్తే అనుమానం వస్తుందని కొందరు బస్సుల్లో కూడా నగదు పంపిస్తున్నారు. హైదరాబాద్ శివారులో ఓ బస్సులో భారీగా నగదు పట్టుబడింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ వద్ద గల రాయికల్ టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. కార్లు, ఇతర వాహనాలతోపాటు ఆర్టీసీ బస్సును కూడా తనిఖీ చేశారు.
టెక్నాలజీ పెరిగిపోతోంది. అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అధిక శ్రమ పడి, చెమటోడ్చి వండి వార్చాల్సిన అవసరం కాస్తా తగ్గింది. ఆకలిగా అనిపించినా, వంట చేసే సమయం లేకపోయినా ఒక్క క్లిక్ తో నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ పెట్టేస్తున్నారు నేటి అతివలు.
బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ సంతోష్ రావుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్ నంబర్ 14లో ఓ భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లతో కబ్జా చేశారని నవయుగ కంపెనీ సంతోష్ రావుపై ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత అరెస్టైన సంగతి తెలిసిందే.
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని భారత్ ఖండించింది. 133 మందిని బలిగొన్న మారణకాండను తీవ్రంగా పరిగణించింది. రష్యా ( Russia ) ప్రజలకు, ప్రభుత్వానికి భారతదేశం బాసటగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.