Share News

Loksabha Polls: ఆర్టీసీ బస్సులో నగదు తరలింపు.. ఎంత అంటే..?

ABN , Publish Date - Mar 24 , 2024 | 02:09 PM

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెర తీస్తున్నారు. భారీగా నగదు తరలిస్తున్నారు. కార్లలో తరలిస్తే అనుమానం వస్తుందని కొందరు బస్సుల్లో కూడా నగదు పంపిస్తున్నారు. హైదరాబాద్ శివారులో ఓ బస్సులో భారీగా నగదు పట్టుబడింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ వద్ద గల రాయికల్ టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. కార్లు, ఇతర వాహనాలతోపాటు ఆర్టీసీ బస్సును కూడా తనిఖీ చేశారు.

Loksabha Polls: ఆర్టీసీ బస్సులో నగదు తరలింపు.. ఎంత అంటే..?

హైదరాబాద్: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల (Loksabha Elections) సందడి నెలకొంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. టికెట్ వచ్చిన అభ్యర్థులు ప్రలోభాల కోసం నగదు (Money), మద్యం (Liquor), చీరలు ఇతరత్రా బహుమతులను సిద్ధం చేస్తున్నారు. రూ.50 వేల కన్నా ఎక్కువ నగదు తీసుకెళ్తే సరైన ధృవపత్రం చూపించాల్సి ఉంటుంది. నగదుకు సంబంధించి వివరాలు తెలియజేయకుంటే పోలీసులు సీజ్ చేస్తున్నారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెర తీస్తున్నారు. భారీగా నగదు తరలిస్తున్నారు. కార్లలో తరలిస్తే అనుమానం వస్తుందని కొందరు బస్సుల్లో కూడా నగదు పంపిస్తున్నారు. హైదరాబాద్ శివారులో ఓ బస్సులో భారీగా నగదు పట్టుబడింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ వద్ద గల రాయికల్ టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. కార్లు, ఇతర వాహనాలతోపాటు ఆర్టీసీ బస్సును కూడా తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.16.50 లక్షలను తరలిస్తున్నారు. దాంతోపాటు వెండి కూడా ఉంది. హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న జయదేవ్ అనే వ్యక్తి నగదు, వెండి తరలిస్తున్నాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సిటీ శివారులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి: BRS: బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్‌ రావుపై కేసు

Updated Date - Mar 24 , 2024 | 02:10 PM