Home » Accident
అదృష్టం సరిగా లేకుంటే... నడుస్తూ వెళ్తున్నా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. అదే అదృష్టం బాగుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఏమీ కాదు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి...
ఆ యువకుల ఇన్స్టా రీల్స్ మోజు వారి తల్లిదండ్రులకు తీవ్ర శోకం మిగిల్చింది. వర్షంలో బైక్పై స్టంట్లు చేస్తూ జారిపడి ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ శివారు పెద్ద అంబర్పేటలో ఈ ఘటన జరిగింది.
భక్తుల(devotees) నడక మార్గంలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం చోటుచేసుకుంది. కేదార్నాథ్(Kedarnath) చిర్బాస సమీపంలో కొండపై నుంచి అకస్మాత్తుగా భారీ మొత్తంలో శిథిలాలు, బండరాళ్లు పడిపోయాయి. దీంతో అదే సమయంలో యాత్రకు వెళ్తున్న వారిలో ముగ్గురు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. కాజీపేట మండలం మడికొండ వద్ద కలకోట్ల స్వప్న అనే మహిళ రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన రాజయ్య కారు ఆమెను ఢీకొట్టింది. బలంగా కారు ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
వార్షిక కన్వర్ యాత్రలో ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ టౌన్ సథేరి గ్రామం సమీపంలో శనివారం ఉదయం ఒక ట్రక్కు బోల్తాపడి సుమారు 10 మంది కన్వరియాలు గాయపడ్డారు.
హైవేపై వేగంగా వెళ్తున్న కారు(car) ఆకస్మాత్తుగా ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టింది(accident). ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన రాజస్థాన్(Rajasthan) బికనీర్(Bikaner) డివిజన్లోని భరత్మాల రహదారిపై జైత్పూర్ టోల్ సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
సరిగ్గా నెల రోజుల వ్యవధిలో మరో రైలు ప్రమాదం.. పశ్చిమబెంగాల్లో గత నెలలో కాంచన్ జంగా ఎక్స్ప్రె్సను గూడ్స్ రైలు ఢీకొట్టిన ఘటనను మర్చిపోకముందే యూపీలోని గోండా జిల్లాలో రైలు పట్టాలు తప్పింది.
మహారాష్ట్ర(maharashtra)లో మరోసారి డ్రంక్ అండ్ డ్రైవ్(drunk and drive) వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పూణెలోని మంజ్రీ ముంధ్వా రోడ్డులో కోళ్లతో వెళ్తున్న టెంపోను ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది(accident). మద్యం మత్తులో ఈ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి మాజీ NCP కార్పొరేటర్ బందు గైక్వాడ్ కుమారుడు కావడం విశేషం.
పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టక తప్పదు. అయితే కొన్నిసార్లు కొందరి విషయంలో చోటు చేసుకునే అకాల మరణాలను చూస్తే.. అయ్యో.. పాపం.. అని అనిపిస్తుంటుంది. ఇంకొందరు తమ అజాగ్రత్త కారణంగా కూడా ...
నేపాల్లో కొండచరియలు విరిగిపడి రెండు బస్సులు నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు భారతీయులు సహా 65 మంది గల్లంతయ్యారు.