Accident: అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు దుర్మరణం
ABN , Publish Date - Jul 19 , 2024 | 09:48 AM
హైవేపై వేగంగా వెళ్తున్న కారు(car) ఆకస్మాత్తుగా ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టింది(accident). ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన రాజస్థాన్(Rajasthan) బికనీర్(Bikaner) డివిజన్‌లోని భరత్‌మాల రహదారిపై జైత్‌పూర్ టోల్ సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
హైవేపై వేగంగా వెళ్తున్న కారు(car) ఆకస్మాత్తుగా ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టింది(accident). ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన రాజస్థాన్(Rajasthan) బికనీర్(Bikaner) డివిజన్‌లోని భరత్‌మాల రహదారిపై జైత్‌పూర్ టోల్ సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. హనుమాన్‌గఢ్ నుంచి బికనీర్ వైపు వెళ్తున్న కారు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో కారులో కూర్చున్న వారందరూ కూడా మరణించారు. కారు హర్యానా నంబర్‌కు చెందినది.
పూర్తిగా ధ్వంసం
ఈ ప్రమాదం నేపథ్యంలో కారు(car) ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో లోపల ఉన్న వ్యక్తులను క్రేన్ సహాయంతో తీయాల్సి వచ్చిందని అధికారులు అన్నారు. కారులో ఉన్న వారిని క్రేన్‌తో బయటకు తీయగా, ఒక్క బాలిక తప్ప అందరూ చనిపోయారు. బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే ఆమె కూడా మరణించింది. మరణించిన వారందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. దబ్వాలి తహసీల్ నివాసితులుగా పోలీసులు గుర్తించారు. అయితే కారు వేగం చాలా వేగంగా వచ్చిన క్రమంలో ట్రక్కును చూసుకోకుండా యాక్సెడెంట్ చేశారని స్థానికులు అంటున్నారు.
గతంలో కూడా
రాజస్థాన్ బార్మర్‌లో ఇటివల రెండు కార్లు ఢీకొన్న(accident) ప్రమాదం ఘటన మరువక ముందే తాజాగా మరొకటి చోటుచేసుకుంది. బార్మర్ ప్రమాదంలో వరుడి సోదరులు ఇద్దరు మృతి చెందారు. అదే సమయంలో ఆరుగురికి గాయాలయ్యాయి. జాతీయ రహదారి 68 సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బొలెరో నడుపుతున్న ఇద్దరు వ్యక్తులు తమ సోదరుడి పెళ్లికి షాపింగ్ చేసి తిరిగి వస్తున్నారు.
అప్పుడు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో పెళ్లి ఇంట్లో రోదనలు మిన్నంటాయి. గత కొన్ని రోజులుగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటివల యూపీ కూడా జరిగిన వరుస రోడ్డు ప్రమాదాల్లో 20 మందికి పైగా మృత్యువాత చెందారు.
ఇదికూడా చదవండి:
కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Crime News and Telugu News