Kanwar Yatra: ట్రక్కు బోల్తాపడి 10 మంది కన్వరియాలకు గాయాలు
ABN , Publish Date - Jul 20 , 2024 | 02:55 PM
వార్షిక కన్వర్ యాత్రలో ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ టౌన్ సథేరి గ్రామం సమీపంలో శనివారం ఉదయం ఒక ట్రక్కు బోల్తాపడి సుమారు 10 మంది కన్వరియాలు గాయపడ్డారు.
ముజఫర్‌నగర్: వార్షిక కన్వర్ యాత్ర (Kanwar Yatra)లో ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ (Muzaffarnagar) టౌన్ సథేరి గ్రామం సమీపంలో శనివారం ఉదయం ఒక ట్రక్కు బోల్తాపడి సుమారు 10 మంది కన్వరియాలు (Kanwariyas) గాయపడ్డారు. వెంటనే వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. గంగా జలాల సేకరణకు ఆగ్ర నుంచి హరిద్వార్‌కు కన్వరియాలు బయలేదిరినప్పుడు వాహనం టైరు పేలిపేవడంతో ఈ ప్రమాదం జరిగిందని క్రైమ్ విభాగం సర్కిల్ ఆఫీసర్ ఆర్.యాదవ్ తెలిపారు.
Yogi Kanwar orders: కన్వర్ యాత్రపై యోగి వివాదాస్పద ఆదేశాలు.. భగ్గుమన్న సొంతపార్టీ నేతలు
కాగా, ఈనెల 22 నుంచి కన్వర్ యాత్ర మొదలవుతుండటంతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ప్రతి జిల్లా సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కన్వరియాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాదయాత్ర కొనసాగించేందుకు చర్యలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్ర మార్గంలో తినుబండారాల దుకాణాలకు యజమానుల పేర్లు తగించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో ప్రభుత్వం ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని హరిద్వార్ పోలీస్ యంత్రాంగం శుక్రవారంనాడు ఆదేశాలు జారీ చేసింది.