Home » Adilabad
మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలకు కట్టుబడి ఉన్నానని, పాలకవర్గం లేకపోవడంతో ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తున్నానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
కవ్వాల టైగర్ జోన్‌లోని జన్నారం డివిజన్‌లో ఆదివారం నిర్వహించిన బర్డ్‌వాచ్ ఆకట్టుకొంది. 15 మంది పర్యాటకులు శనివారం రాత్రి అటవీ ప్రాంతంలో బస చేసి, ఆదివారం తెల్లవారుజామున పక్షులను లెన్స్ కెమెరాల ద్వారా వీక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసిన సందర్భంగా ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
యువత చదు వుతోపాటు క్రీడల్లో రాణించాలని మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని బీఆర్ అం బేద్కర్ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న కాసిపేట మం డల ప్రీమియర్‌లీగ్ సీజన్ 3 పోటీలను ఆదివారం ప్రారం భించారు.
Road Accidents: తెలంగాణలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 75 మంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
రుణం తీర్చే అంశంలో బ్యాంకు సిబ్బంది వేధింపులు తాళలేక తీవ్ర మనోవేదనకు గురైన ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనకు అప్పు ఇచ్చిన బ్యాంకులోనే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఆర్ తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 19న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసెంబ్లీలో మంచిర్యాలను మున్సిపల్ కార్పొ రేషన్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
గోదావరి తీరం నుంచి రాత్రి,పగలు తేడా లేకుండా ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. గుడిరేవు గోదావరి నుంచి నిత్యం ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
పాలకవర్గం లేని మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని అఖిలపక్ష పార్టీల నాయకులు అందుగుల శ్రీనివాస్, కొంగల తిరుపతిరెడ్డి, రాయబారపు వెంకన్నలు తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడుతూ మున్సిపాలిటీకి ఎన్నికలు లేకపోవడం వల్ల ప్రజలు నష్టపోతున్నారని, సంక్షేమం కుంటు పడుతుందన్నారు.
చెన్నూరు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. శనివారం రాత్రి మున్సిపల్ కార్యాల యంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.