Share News

Delhi: 151 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై మహిళా నేరారోపణ అభియోగాలు!.. 16 మందిపై అత్యాచార కేసులు

ABN , Publish Date - Aug 21 , 2024 | 05:20 PM

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సామాన్యులే కాదు.. మనం ఎన్నుకుని చట్టసభలకు పంపించిన అనేక మంది ప్రజాప్రతినిధులపై కూడా లైంగిక ఆరోపణలు, మహిళలపై దౌర్జన్యాల కేసులు ఉన్నాయి.

Delhi: 151 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై మహిళా నేరారోపణ అభియోగాలు!.. 16 మందిపై అత్యాచార కేసులు

ఢిల్లీ: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సామాన్యులే కాదు.. మనం ఎన్నుకుని చట్టసభలకు పంపించిన అనేక మంది ప్రజాప్రతినిధులపై కూడా లైంగిక ఆరోపణలు, మహిళలపై దౌర్జన్యాల కేసులు ఉన్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) సంస్థ సదరు ప్రజాప్రతినిధులపై సర్వే నిర్వహించింది.

2019 - 24 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బరిలో నిలిచిన అభ్యర్థులకు చెందిన 4,809 అఫిడవిట్‌లలో 4,693 మంది వివరాల్ని ఏడీఆర్ పరిశీలించింది. ఇందులో151 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికల అఫిడవిట్‌లలో మహిళలపై నేరాలకు సంబంధించి తమపై ఉన్న కేసులను వెల్లడించారు.


వెస్ట్ బెంగాల్‌లోనే అత్యధికం..

కోల్‌కతా కేసుతో ఒక్కసారిగా పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం చర్చల్లో నిలిచింది. ప్రజాప్రతినిధుల అఫిడవిట్ల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోనే అత్యధిక శాసనసభ్యులు నేరారోపణలు(మహిళలపై) ఎదుర్కోవడం సంచలనం సృష్టిస్తోంది. 151లో 16 మంది ఎంపీలు, 135 మంది పలు రాష్ట్రాల్లో శాసనసభ సభ్యులుగా ఉన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిలో 25 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఈ తరహా ఆరోపణలు, కేసుల్లో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో ఉంది. ఒడిశా 17 మందితో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా అత్యాచారానికి సంబంధించిన కేసుల్లో 16 మంది ప్రజాప్రతినిధులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నేరం రుజువైతే వీరికి 10 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. కొందరిపై పదుల సంఖ్యలో కేసులు ఉండటం గమనార్హం.


అత్యధిక నేరస్థులు ఆ పార్టీలోనే..

అయితే నేరస్థులకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేస్తుందని ఏడీఆర్ పేర్కొంది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని ఏడీఆర్ సూచించింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులను ఎన్నుకోవద్దని ఓటర్లను కోరింది.

For Latest News and Telangana News click here

Updated Date - Aug 21 , 2024 | 05:28 PM