Home » Agnipath Scheme
ఒడిశాలోని ఐఎన్ఎస్ చిలుకలో అగ్నివీర్ నాల్గవ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మొదటి మూడు బ్యాచ్‌ల్లో 2,500 మంది శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరారని తెలిపారు. 2022లో అగ్నివీర్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు.
అగ్నివీర్ చక్రాయుధంలో యువత చిక్కుకున్నారని, అగ్నివీరుల పెన్షన్‌కు బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు జరపలేదని విపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విపక్ష నేత ఎప్పుడు కోరినా సభలో సమగ్ర ప్రకటనకు తాను సిద్ధమన్నారు.
అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారంనాడు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సామాజిక మాధ్యమ 'ఎక్స్'లో తెలిపారు. అగ్నివీరులు సర్వీసు నుంచి తిరిగి రాగానే పోలీసు సర్వీసు, పీఏసీలో ప్రాధాన్యతా క్రమంలో ఉద్యోగాకావశాలు కల్పిస్తామని చెప్పారు.
కార్గిల్ దివస్ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అగ్నివీరులకు రిజర్వేషన్ కల్పిస్తామని ఆయన ప్రకటించారు. సైన్యంలో విధులు నిర్వహించిన అనంతరం రాష్ట్రానికి తిరిగి వచ్చిన అగ్ని వీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.
సైన్యంలో సంస్కరణల కోసం అగ్నిపథ్ పథకం తీసుకువచ్చామని, విపక్షాలు మాత్రం ఈ పథకంపై యువతను తప్పుదారి పట్టించేలా విమర్శలు చేస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'కార్గిల్' దివస్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తిప్పికొట్టారు. మోదీ ఆబద్ధాలు వ్యాప్తి చేస్తూ, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు.
అగ్నిపథ్ పథకంపై(Agnipath Scheme) కేంద్రం, విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతున్న సమయంలో హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు(Agniveer) పోలీసు, మైనింగ్‌లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ బుధవారం ప్రకటించారు.
కేంద్ర సాయుధ దళాల్లోని 10 కానిస్టేబుల్ పోస్టులని మాజీ అగ్నివీర్‌లకు రిజర్వ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) హెడ్‌క్వార్టర్స్‌లో ప్రభుత్వం మినహాయింపు ఇస్తుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్ తెలిపారు.
అగ్నిపథ్ అభ్యర్థుల వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచాలని, నాలుగేళ్ల తర్వాత కనీసం 50% మందిని కొనసాగించాలని సాయుధ దళాలు కేంద్రానికి సిఫారసు చేయనున్నాయి.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి పారితోషికం గురించి భారత సైన్యం(Indian Army) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అజయ్ వీర మరణాంతరం వారి కుటుంబానికి పరిహారం చెల్లించలేదనే ఆరోపణలను ఆర్మీ తోసిపుచ్చింది.
మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం లోక్‌సభలో విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ విమర్శలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తనదైన శైలిలో స్పందించారు.