Share News

Indian Army: అవన్నీ అబద్ధాలు.. అగ్నివీర్ కుటుంబాల పరిహారంపై ఆర్మీ వివరణ

ABN , Publish Date - Jul 04 , 2024 | 06:43 AM

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్ కుమార్‌ కుటుంబానికి పారితోషికం గురించి భారత సైన్యం(Indian Army) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అజయ్ వీర మరణాంతరం వారి కుటుంబానికి పరిహారం చెల్లించలేదనే ఆరోపణలను ఆర్మీ తోసిపుచ్చింది.

Indian Army: అవన్నీ అబద్ధాలు.. అగ్నివీర్ కుటుంబాల పరిహారంపై ఆర్మీ వివరణ

ఢిల్లీ: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్ కుమార్‌ కుటుంబానికి పారితోషికం గురించి భారత సైన్యం(Indian Army) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అజయ్ వీర మరణాంతరం వారి కుటుంబానికి పరిహారం చెల్లించలేదనే ఆరోపణలను ఆర్మీ తోసిపుచ్చింది.

అజయ్ కుటుంబానికి ఇప్పటికే రూ.98 లక్షల 39 వేలు చెల్లించినట్లు భారత సైన్యం తెలిపింది.


"బకాయి ఉన్న మొత్తం సొమ్ములో అగ్నివీర్ అజయ్ కుటుంబానికి ఇప్పటికే రూ. 98.39 లక్షలు చెల్లించాం. అగ్నివీర్ స్కీమ్(Agniveer Scheme) నిబంధనలు వర్తించే విధంగా.. పోలీస్ వెరిఫికేషన్ తర్వాత త్వరలో మొత్తం అమౌంట్ సెటిల్ అవుతుంది. రూ.1.65 కోట్లు అజయ్‌కి ఇవ్వాల్సి ఉంది. అగ్నివీర్‌ స్కీంలోని నిబంధనల మేరకు మరో రూ.67 లక్షల వరకు పరిహారం, ఇతర ప్రయోజనాలు, పోలీసు ధ్రువీకరణ అయిపోగానే సెటిల్‌ చేస్తాం. దీంతో మొత్తం రూ.1.65 కోట్లు అవుతుంది" అని ఆర్మీ ఎక్స్‌లో పేర్కొంది.


రాహుల్ ఏమన్నారంటే..

అమరులైన అగ్నివీర్‌ల కుటుంబాలకు పరిహారం విషయమై పార్లమెంట్‌ సాక్షిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అబద్ధాలాడారని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. అందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘అమరుడైన ఓ అగ్నివీర్‌ కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించామని రాజ్‌నాథ్‌ అన్నారు. అయితే తమ కుటుంబానికి ఏ సాయం అందలేదని ఆ అగ్నివీర్‌ అజయ్‌ తండ్రే చెప్పారు’ అంటూ ‘ఎక్స్‌’లో రాహుల్‌ ఓ వీడియో షేర్‌ చేశారు. కాగా, రాహుల్‌ గాంధీ పార్లమెంటులో ఇటీవల హిందువుల గురించి చేసిన వ్యాఖ్యలపై బిహార్‌లో కేసు నమోదు చేశారు.

For Latest News click here

Updated Date - Jul 04 , 2024 | 07:00 AM