Share News

Ashwini Vaishnaw: రాహుల్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

ABN , Publish Date - Jul 01 , 2024 | 07:05 PM

మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం లోక్‌సభలో విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ విమర్శలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తనదైన శైలిలో స్పందించారు.

Ashwini Vaishnaw: రాహుల్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ, జులై 01: మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం లోక్‌సభలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో రాహుల్ విమర్శలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ న్యూఢిల్లీలో విలేకర్ల సమావేశంలో స్పందించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్నారు. ప్రతిపక్ష నేత పదవి చాలా బాధ్యతతో కూడుకున్నదని ఆయన పేర్కొన్నారు.

Also Read: AP: పలువురు పోలీస్ ఉన్నతాధికారులు మాతృశాఖకు బదిలీ

అలాంటి పదవిని తొలిసారిగా చేపట్టిన రాహుల్ గాంధీ ఇటువంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. అగ్నివీరుల పథకాన్ని ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఖండించారు. అగ్నివీరులను వాడుకొని వదిలేసే కార్మికులగా ఆయన అభివర్ణించారన్నారు. అలాగే ఈ పథకంలో చేరిన వారిలో.. ఒకరు పెన్షన్ అందుకుంటారు. మరొకరు అందుకొరంటూ ఆయన విమర్శలు చేశారని గుర్తు చేశారు. అంతేకాదు జవాన్ల మధ్య విభజన సృష్టిస్తున్నారంటూ రాహుల్ పేర్కొన్నారని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.

Also Read: Who is Awadhesh Prasad: రాహుల్ గాంధీ ‘ఆయనకు’ ఎందుకు షేక్‌హ్యాండ్ ఇచ్చారు?


Also Read: INDIA Bloc: మోదీ ప్రభుత్వ తీరుపై ఎంపీలు ఆందోళన

అయితే అగ్నివీరుల పథకంపై సభలో కాంగ్రెస్ పార్టీ చాలా సార్లు ఇలా విమర్శలు గుప్పించిందన్నారు. వారి విమర్శలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి పలుమార్లు సరైన సమాధానమిచ్చారన్నారు. అయినా రాజ్యాంగ పదవులపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నేతలకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ హితవు పలికారు.

Also Read: Viral Video: ‘ఆ వీడియో’పై సీఎంను నివేదిక కోరిన గవర్నర్

ఇక ఈ రోజు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మొత్తం హిందూ సమాజం హింసాత్మకమైనదే కాకుండా అసత్యమైనదన్నట్లు వ్యాఖ్యానించారని ఆయన వివరించారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలతో.. తన ప్రతిపక్ష హోదా స్థాయిని తగ్గించారన్నారు. రాహుల్ ఈ తరహా ప్రకటనపై దేశవ్యాప్తంగా విచారం వ్యక్తమవుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.

Also Read: Australia: స్టూడెంట్ వీసా ఛార్జీలు భారీగా పెంపు.. ఈ రోజు నుంచి అమలు

For More National News and Latest Telugu News click here

Updated Date - Jul 01 , 2024 | 07:07 PM