Home » AICC
తెలంగాణ సీఎం, సీఎల్పీ నేత, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్‌కి చేరుకున్నారు. స్పీకర్ ఓం బిర్లా ( Speaker Om Birla ) ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. స్పీకర్‌ని కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఎంపీ పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేశారు.
సీఎల్పీ నేతగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరును హై కమాండ్ ఖరారు చేసినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. తెలంగాణ రెండో సీఎంగా రేవంత్‌రెడ్డి 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులతో కూడిన క్యాబినేట్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Telangana: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే పాల్గొన్నారు.
Telangana: తెలంగాణ సీఎం ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేపట్టింది. మంగళవారం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ అయి.. ఎమ్మెల్యేల ఏకవాక్య తీర్మానాన్ని అధిష్టానానికి అందజేశారు.
Telangana: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ పరిశీలకులు మంగళవారం సమావేశమయ్యారు. ఖర్గే నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే పాల్గొన్నారు.
Telangana: తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అధిష్టానం నిర్ణయమే తమ నిర్ణయమని సీఎల్పీ మీటింగ్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానాన్ని చేసిన విషయం తెలిసిందే. సీఎల్పీ నిర్ణయాన్ని ఏఐసీసీకి నివేదించేందుకు తెలంగాణ పరిశీలకులు, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీకి చేరుకున్నారు.
ఏఐసీసీ తెలంగాణ సీఎల్పీ నాయకుడిని ప్రకటిస్తుందని మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) పేర్కొన్నారు. సోమవారం నాడు గాంధీభవన్‌లో భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు హైదరాబాద్‌లో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎల్పీ నాయకుడి ఎంపికను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ ఏక వాక్య తీర్మానం చేసి పంపించడం జరిగింది. ప్రస్తుతం ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వివిధ కథనాలు ఊహాగానాలు మాత్రమే.. వాటిని ఎవరు నమ్మొద్దని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
తెలంగాణ సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరుని ఏఐసీసీ ఖరారు చేసింది. ఈనెల 7వ తేదీన ఉదయం 10 గంటలకు పూర్తిస్థాయిలో రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిసెంబర్ 5, 6 తేదీలు మంచిరోజులు కాదని ప్రమాణ స్వీకారాన్ని 7వ తేదీకి వాయిదా వేశారు.7వ తేదీన ఉదయం రేవంత్‌రెడ్డితో పాటు పూర్తి స్థాయిలో మంత్రి వర్గం కొలువు తీరనున్నది.
Telangana: తెలంగాణ ఎన్నికల ఫలితాలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇక తెలంగాణ సీఎం ఎవరనే ప్రశ్న మొదలైంది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఈరోజు (సోమవారం) ఉదయం సీఎల్పీ సమావేశం జరుగగా.. సీఎల్పీ నేతగా ఎవరు ఉండాలని దానిపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేజిక్ ఫిగర్‌ను దాటేసిన కాంగ్రెస్ పార్టీ.. సీఎం ఎంపికపై కసరత్తు చేస్తోంది. పార్టీ తరపున గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలతో కూడిన శాసనసభాపక్షం గచ్చిబౌళిలోని ఎల్ల హోటల్లో సోమవారం ఉదయం 9.30 గంటలకు సమావేశం కానుంది.