CM Revanth: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్..
ABN , Publish Date - Mar 06 , 2024 | 01:59 PM
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (గురువారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఏఐసీసీలో జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సీఎం హాజరుకానున్నారు. రేపు తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ఏఐసీసీ పూర్తి చేయనుంది. ఒకటి రెండు రోజుల్లో మెజారిటీ లోక్‌సభ స్థానాలను ఏఐసీసీ ప్రకటించనుంది.
న్యూఢిల్లీ, మార్చి 6: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రేపు (గురువారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఏఐసీసీలో (AICC) జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సీఎం హాజరుకానున్నారు. రేపు తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ఏఐసీసీ పూర్తి చేయనుంది. ఒకటి రెండు రోజుల్లో మెజారిటీ లోక్‌సభ స్థానాలను ఏఐసీసీ ప్రకటించనుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముగిసిన విషయం తెలిసిందే.
మరోవైపు రేపే టీ కాంగ్రెస్ కూడా ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక బాధ్యత రేవంత్‌కు అధిష్ఠానం అప్పజెప్పింది. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను రేవంత్ హై కమాండ్‌కు వివరించనున్నారు. గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామని హస్తం నేతలు అంటున్నారు. తొలి జాబితాలో సీటు దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో ఏకాభిప్రాయం ఉన్న సీట్లను రేపు ఏఐసీసీ ప్రకటించనుంది.
ఇవి కూడా చదవండి..
Komatireddy Venkatreddy: బీఆర్‌ఎస్‌లో హరీష్‌రావు ఉండడం డౌటే!
Chandrababu: చంద్రబాబు వద్దకు క్యూ కట్టిన ఆశావహులు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...