AP Politics: షర్మిల దెబ్బ.. జగన్ అబ్బా.. ఎన్నికలవేళ పీక్స్‌కు చేరిన పాలిటిక్స్..!
ABN , Publish Date - Mar 20 , 2024 | 01:24 PM
వై నాట్ 175 కొద్ది రోజుల క్రితం జగన్ నోట గట్టిగా వినిపించిన మాట.. రానురాను స్వరం మారింది. సంఖ్య మారుతోంది. దీనికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఒకటైతే.. రెండోది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. జగన్ నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తోందంట. తాజాగా జగన్‌కు చెల్లి షర్మిల (Sharmila) భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్(Congress)లో విలీనం చేసి ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు వైఎస్.షర్మిల.
వై నాట్ 175 కొద్ది రోజుల క్రితం జగన్ నోట గట్టిగా వినిపించిన మాట.. రానురాను స్వరం మారింది. సంఖ్య మారుతోంది. దీనికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఒకటైతే.. రెండోది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. జగన్ నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తోందంట. తాజాగా జగన్‌కు చెల్లి షర్మిల (Sharmila) భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్(Congress)లో విలీనం చేసి ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు వైఎస్.షర్మిల. సొంత అన్నయ్య ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. వైసీపీని గద్దె దించాలని పిలుపునిస్తున్నారు. కాంగ్రెస్ ఏపీలో ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది పక్కన పెడితే.. ఎన్ని ఓట్లు చీలుస్తుందనే భయం జగన్‌ను వెంటాడుతుంటనే చర్చ గట్టిగానే వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపులో షర్మిల పాత్ర ఉంది. అయితే అధికారం చేపట్టిన తర్వాత జగన్ షర్మిలను దూరం పెట్టారు. అన్నయ్య వైఖరితో విసుగుచెందిన షర్మిల జగన్‌కు దూరంగా ఉంటూ వస్తోంది. మారిన రాజకీయ పరిణామాలతో షర్మిల కాంగ్రెస్‌లో చేరి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టింది. అప్పటి నుంచి జగన్‌లో ఓటమి భయం మరింత ఎక్కువైందనే వార్తలు వినిపిస్తున్నాయి.
షర్మిల రాకతో
షర్మిల పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు యాక్టివ్ అయ్యారు. రచ్చబండ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. పాత క్యాడర్‌ను పార్టీలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడకక్కడ వైసీపీపై అసంతృప్తితో ఉండి.. ఇతర పార్టీల్లో చేరడం ఇష్టం లేక తటస్థంగా ఉన్న నేతలను మళ్లీ కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. ఇదే ఇప్పుడు జగన్‌ను తెగ ఇబ్బంది పెడుతోందట. రాష్ట్ర విభజన తర్వాత.. కాంగ్రెస్ క్యాడర్ ఎక్కువ శాతం వైసీపీ వైపు మళ్లింది. మరికొందరు ఇతర పార్టీల్లో చేరారు. కాంగ్రెస్ తన ఉనికినే కోల్పోయింది. 2019 ఎన్నికల్లోనూ హస్తం పార్టీ ఏపీలో పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీలో కొంచెం ఊపు కనిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది. రాజశేఖరెడ్డి కుమారుడిగా జగన్‌కు ప్రజల్లో ఎంత పేరుందో.. అదే స్థాయిలో వైఎస్సార్ కుమార్తెగా షర్మిలకు ప్రజల్లో కొంత ఆదరణ ఉంది. రాష్ట్రంలో అధికారం చేపట్టగలిగే స్థాయిలో ఈ ఆదరణ లేకపోయినా.. ఎక్కడికి వెళ్లినా ఆమెను గుర్తు పట్టగలిగే స్థాయిలో ఉండొచ్చు.
Big Breaking: కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల!
కాంగ్రెస్‌కు జవజీవాలు..
ఐదేళ్ల వైసీపీ పాలనపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపు వెళ్లే అవకాలు ఎక్కువని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. తాజాగా వైసీపీలో ఉంటూ షర్మిల అభిమానించేవాళ్లు కొందరు ఉన్నారు. తాజాగా విశాఖపట్టణంలో నిర్వహించిన సభతో కాంగ్రెస్‌కు షర్మిల జవజీవాలు కల్పిస్తుందనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో వైసీపీ ఓటు బ్యాంకు షర్మిల కనీసం 2 శాతం లాక్కున్న తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన వైసీపీలో కనిపిస్తోందట. అదే జరిగితే 2019 ఫలితం రివర్స్ కావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీంతో తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకు మొదలైందనే చర్చ జరుగుతోంది. వైసీపీపై షర్మిల ప్రభావం ఏ మేర ఉందనేది ఎన్నికల ఫలితాలతో తేలనుంది.
Lok Sabha Elections: తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్.. యూపీలో ఈక్వేషన్స్ ఇవే..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..