Home » AIMIM
లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి ఏఐఎంఐఎం(AIMIM) అధినేత అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు ప్రచార జోరు చూపిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసురుకుంటున్నారు. ముస్లింలపై ప్రధాని మోదీ చేసిన కామెంట్లను ఎంఐఎం(AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ఖండించారు.
బీజేపీ (BJP) దెబ్బకు పాత బస్తీలో బద్ధ శత్రువులు ఏకమయ్యారా!? ఇక్కడ ఎంఐఎంకు ఎంబీటీ పరోక్ష మద్దతు ఇస్తోందా!? మజ్లిస్‌కు (AIMIM)సహకరించడానికే పోటీ నుంచి తప్పుకుందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి తాజా పరిణామాలు..
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. పోలింగ్‌కు మరో 17రోజుల సమయం మాత్రమే ఉంది. ఎక్కువ సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా 17లోక్‌సభ స్థానాలు ఉన్నప్పటికీ.. అందరి గురి కేవలం 16 స్థానాలే.. ఈ నియోజకవర్గాల్లోనే గెలుపు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు పోటీపడుతుంటారు. మరో నియోజకవర్గం గురించి అసలు ప్రస్తావనే ఉండదు.. ఎందుకంటే ఎన్నికలకు ముందే అక్కడి ఫలితం ఎలా ఉంటుందో ప్రజలందరికీ తెలుసు. అదే హైదరాబాద్ నియోజకవర్గం. ఓవైసీ కుటుంబానికి 35 ఏళ్ల నుంచి ఈ నియోజకవర్గం అడ్డాగా మారింది.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశంలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. అధికార బీజేపీని ఢీ కొట్టడమే ధ్యేయంగా తమిళనాడులో రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి రెడీ అయ్యాయి. తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే, జాతీయ పార్టీ ఏఐఎంఐఎం(AIMIM)లు పొత్తుకు సిద్ధమయ్యాయి.
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. ఈనెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తెలంగాణలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం హైదరాబాద్. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించగా.. ఎంఐఎం నుంచి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు.
నగరంలో బీజేపీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. పాతబస్తీలో పార్టీని పటిష్టం చేయాలనే ధ్యేయంతో అడుగులు వేస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలో మజ్లి్‌సకు గట్టి పోటీ ఇచ్చేందుకు విరించి ఆస్పత్రి, లతామా ఫౌండేషన్ల చైర్పర్సన్ మాధవీలతకు టికెట్ ఖరారు చేసింది. మజ్లి్‌సకు దీటుగా ఉండేందుకే మాధవీలతకు టికెట్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజకీయాలకు మాధవీలత కొత్త. ఆమెకు పార్టీలో గాడ్‌ఫాదర్ ఎవరూ లేరనే చెప్పొచ్చు. ఎంఐఎం కంచుకోటను బద్దలు కొడతానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఏఐఎంఐఎం(AIMIM) బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అభ్యర్థుల్ని నిలబెడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ఖండించారు. రాహుల్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హైదరాబాద్ లో నిర్వహించిన బహిరంగ ర్యాలీలో ఈ కామెంట్లు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్‌లో పోటీ చేయాలని బహిరంగంగా సవాల్ చేశారు.
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ (Asaduddin Owaisi) ఇంటిపై అగంతకులు రాళ్ల దాడికి (Stones Pelted ) తెగబడ్డారు. ఢిల్లీలోని (New Delhi) ఆయన నివాసంపై సోమవారం సాయంత్రం 3:30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది..