Share News

AIMIM: తమిళనాట పొడిచిన కొత్త పొత్తు.. మజ్లిస్, అన్నాడీఎంకే కలిసి ఎన్నికల బరిలో

ABN , Publish Date - Apr 13 , 2024 | 06:41 PM

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశంలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. అధికార బీజేపీని ఢీ కొట్టడమే ధ్యేయంగా తమిళనాడులో రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి రెడీ అయ్యాయి. తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే, జాతీయ పార్టీ ఏఐఎంఐఎం(AIMIM)లు పొత్తుకు సిద్ధమయ్యాయి.

AIMIM: తమిళనాట పొడిచిన కొత్త పొత్తు.. మజ్లిస్, అన్నాడీఎంకే కలిసి ఎన్నికల బరిలో

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశంలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. అధికార బీజేపీని ఢీ కొట్టడమే ధ్యేయంగా తమిళనాడులో రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి రెడీ అయ్యాయి. తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే, జాతీయ పార్టీ ఏఐఎంఐఎం(AIMIM)లు పొత్తుకు సిద్ధమయ్యాయి.

ఈ మేరకు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ శనివారం ఓ ప్రకటన జారీ చేశారు. బీజేపీని వ్యతిరేకిస్తూ బయటకి వచ్చిన.. అన్నాడీఎంకే భవిష్యత్తులోనూ బీజేపీతో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేసిన తరుణంలో మజ్లిస్‌తో పొత్తు ప్రతిపాదన ముందుకు వచ్చింది. సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ చట్టాలను వ్యతిరేకిస్తామని అన్నాడీఎంకే.. మజ్లీస్‌కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అందువల్ల రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు పొత్తుకు సిద్ధమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల వరకు తమ పొత్తు కొనసాగుతుందని అసద్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఓటర్లలో దాదాపు 5 శాతం ముస్లిం సామాజికవర్గ ఓట్లు ఉన్నాయి.


బీజేపీ నుంచి వైదొలగిందిలా..

తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే, బీజేపీలది సంక్లిష్టమైన చరిత్ర. గతంలో అన్నాడీఎంకే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా చేరింది. అయితే ఇటీవల ఆ పార్టీ బీజేపీతో బంధాన్ని తెంచుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏలో ఉండబోమని స్పష్టం చేసింది.

Gmail: జీమెయిల్ మెసేజ్‌లతో స్టోరేజ్ నిండిందా.. ఈ సెట్టింగ్స్ చేసుకోండి

రానున్న రోజుల్లో బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోబోమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తమిళనాడులో 2024 లోక్‌సభ ఎన్నికలు 7 దశల్లో జరగాల్సి ఉంది. పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తుంది. జూన్ 4న ఫలితాలు విడుదలవుతాయి. ఈసీ షెడ్యూల్‌ ప్రకటించిన వెంటనే మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లోకి వచ్చింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

18వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం 2024 మార్చి 16న ప్రకటించింది. 17వ లోక్‌సభ పదవీకాలం 2024 జూన్ 16తో ముగియనుంది. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా మొదటి దశలో 102, రెండో దశలో 89, మూడో దశలో 94, నాలుగో దశలో 96, ఐదో దశలో 49, ఆరో దశలో 57, ఏడో దశలో 57 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 13 , 2024 | 06:41 PM