Share News

Elections 2024: ఎంఐఎంలో భయం మొదలైందా.. హైదరాబాద్‌లో అదే జరగనుందా..!

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:56 PM

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. పోలింగ్‌కు మరో 17రోజుల సమయం మాత్రమే ఉంది. ఎక్కువ సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), బీఆర్‌ఎస్ (BRS) వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా 17లోక్‌సభ స్థానాలు ఉన్నప్పటికీ.. అందరి గురి కేవలం 16 స్థానాలే.. ఈ నియోజకవర్గాల్లోనే గెలుపు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు పోటీపడుతుంటారు. మరో నియోజకవర్గం గురించి అసలు ప్రస్తావనే ఉండదు.. ఎందుకంటే ఎన్నికలకు ముందే అక్కడి ఫలితం ఎలా ఉంటుందో ప్రజలందరికీ తెలుసు. అదే హైదరాబాద్ నియోజకవర్గం. ఓవైసీ కుటుంబానికి 35 ఏళ్ల నుంచి ఈ నియోజకవర్గం అడ్డాగా మారింది.

Elections 2024: ఎంఐఎంలో భయం మొదలైందా.. హైదరాబాద్‌లో అదే జరగనుందా..!
Asaduddin Owaisi

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. పోలింగ్‌కు మరో 17రోజుల సమయం మాత్రమే ఉంది. ఎక్కువ సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), బీఆర్‌ఎస్ (BRS) వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా 17లోక్‌సభ స్థానాలు ఉన్నప్పటికీ.. అందరి గురి కేవలం 16 స్థానాలే.. ఈ నియోజకవర్గాల్లోనే గెలుపు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు పోటీపడుతుంటారు. మరో నియోజకవర్గం గురించి అసలు ప్రస్తావనే ఉండదు.. ఎందుకంటే ఎన్నికలకు ముందే అక్కడి ఫలితం ఎలా ఉంటుందో ప్రజలందరికీ తెలుసు. అదే హైదరాబాద్ నియోజకవర్గం.


ఓవైసీ కుటుంబానికి 35 ఏళ్ల నుంచి హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం అడ్డాగా మారింది. 1984 నుంచి 2004 వరకు సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ఎంపీగా ఉండగా.. 2004 నుంచి ఇప్పటివరకు అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఉంటూ వస్తున్నారు. ముస్లిం ఓట్లు అధికంగా ఉండటంతో ఈ నియోజకవర్గంలో గెలుపు ఓవైసీ కుటుంబానికి సులభమైంది. ఈ ఎన్నికల్లోనూ ఎంఐఎం పార్టీ గెలుపు లాంఛనమేనని అంతా భావించారు. కానీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అసదుద్దీన్ ఓవైసీ ఓడిపోతారా అనే చర్చ గత 20 ఏళ్లలో మొదటిసారి జరుగుతోంది. ఫస్ట్‌టైమ్ ఎంఐఎం పార్టీలో ఓటమి భయం మొదలైందనే చర్చ జరుగుతోంది.

Congress: హరీష్‌రావు రాజీనామా స్పీకర్ ఫార్మాట్‌లో లేదు: మంత్రి కోమటిరెడ్డి


లక్షపైనే..

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 2004 నుంచి అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. ఆయన మెజార్టీ ఎప్పుడూ లక్షపైనే. తరువాతి స్థానంలో బీజేపీ ఉండేది. ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ ఎంఐఎం, బీజేపీ మధ్య ఉన్నా.. గెలుపు ఎంఐఎందే అన్నట్లుగా ఉండేది. కానీ బీజేపీ తన అభ్యర్థి ప్రకటనతో ఓల్డ్‌సిటీ రాజకీయ స్వరూపాన్ని మార్చేసింది. మరోవైపు 5లక్షలకు పైగా ఓట్ల తొలగింపుతో ఓవైసీలో ఓటమి భయం పట్టుకుందనే ప్రచారం జరుగుతోంది. 2004 నుంచి ఓవైసీ మెజార్టీ లక్ష నుంచి 3 లక్షల మధ్య ఉండేది.


హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో నకిలీ ఓట్లు ఎక్కువుగా ఉన్నాయని, నియోజకవర్గంలో ఓటు ఉన్నప్పటికీ.. వారంతా ఇక్కడ నివాసం ఉండరని, అయితే ఎన్నికల సమయంలో వారంతా ఓటు వేసేవారనే ఆరోపణలు ఉన్నాయి. భారీగా రిగ్గింగ్ జరిగేదని, ఇక్కడ నివాసం ఉండని ఓటర్ల ఓట్లను ఎంఐఎం నాయకులు వేరే వ్యక్తులతో వేయించేవారనే ఆరోపణలు ఉన్నాయి. బోగస్ ఓట్లతోనే ఓవైసీ ఎంపీగా గెలుస్తున్నారని, నకిలీ ఓట్లు తొలగించనంత వరకు ఓవైసీ కుటుంబమే ఎంపీగా గెలుస్తుందని కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ పలు సందర్భాల్లో చెప్పారు. తాజాగా 5లక్షలకు పైగా బోగస్ ఓట్లను తొలగించడంతో ఈసారి హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ప్రచారం స్పీడ్ పెంచిన బీజేపీ

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలతను ప్రకటించడంతో.. ఆమె గత కొద్దిరోజులుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తన మాటతీరుతో ప్రజలందరినీ ఆమె ఆకర్షిస్తున్నారు. ఓవైసీ టార్గెట్‌గా ఆమె చేస్తున్న ప్రసంగాలు వైరల్ అవడంతో ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. గతంలో ఎన్నికలంటే తన ప్రచారం తాను చేసుకుంటూ విపక్షపార్టీ అభ్యర్థులను లెక్కచేయని ఓవైసీ.. ప్రస్తుతం మాధవీలతను టార్గెట్ చేస్తున్నారు.


మరోవైపు తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఫస్ట్‌టైమ్ ఓవైసీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఆయన తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఓ వర్గం ఓట్లను పూర్తిస్థాయిలో పోలరైజేషన్ చేసేందుకే ఓవైసీ అలా మాట్లాడి ఉంటారనే అభిప్రాయం కొందరినుంచి వ్యక్తమైంది. మొత్తానికి ప్రచారంలో మాధవీలత ముందున్నట్లు తెలుస్తోంది. మాధవీలత సైతం ఓ వర్గం ఓట్లను పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.


ఓవైసీ ఓడిపోతారా..!

హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో ముస్లీంల ఓట్లు అధికం కావడంతో 35 ఏళ్లుగా ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించడం ఆనవాయితీగా వస్తోంది. బీజేపీ మినహా ఇతర పార్టీలు అభ్యర్థులను బరిలో దింపినా.. ప్రధాన పోటీ ఎంఐఎం, బీజేపీ మధ్యనే నడుస్తుంది. ఈ క్రమంలో బోగస్ ఓట్ల తొలగింపు ఓవైసీకి నష్టమా.. లాభమా అనే చర్చ సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఓవైసీకి గెలుపు నల్లేరుపై నడక కాదని, బీజేపీ అభ్యర్థి నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. బోగస్ ఓట్లపైనే ఆధారపడి ఓవైసీ గత కొన్నాళ్లుగా గెలుస్తూ వస్తున్నారన్న ఆరోపణలు నిజమైతే మాత్రం హైదరాబాద్‌లలో ఎంఐఎం గెలుపు అంత ఈజీకాదనే ప్రచారం జరుగుతోంది. అసలు ఫలితం ఎలా ఉండబోతుందనేది జూన్4న తేలనుంది.


CM Revanth: రుణమాఫీ చేసి తీరుతాం... హరీష్ రాజీనామా రెడీగా పెట్టుకో.. రేవంత్ కౌంటర్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 26 , 2024 | 04:56 PM