Home » Air india
మూకుమ్మడి సెలవులు పెట్టిన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ క్రమశిక్షణ చర్యలు ప్రారంభించింది. సాయంత్రానికి ఉద్యోగులు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
సిక్ లీవ్ పెట్టడంతో 19వేల మంది ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు ఎయిర్ ఇండియా(Air India Express) తమ సిబ్బందిపై చర్యలు తీసుకుంది.
టాటాగ్రూప్ టేకోవర్ చేసిన విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సిబ్బంది మూకుమ్మడి సెలవులు పెట్టడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా 90కిపైగా విమానాలు రద్దయ్యాయి.
ఎయిర్ ఇండియా(Air India) సిబ్బంది నిర్వాకంతో 80కిపైగా విమానాలు రద్దు అయ్యాయి. క్యాబిన్ సిబ్బంది అకస్మాత్తుగా సిక్ లీవ్స్ పెట్టడంతో విమానాలను రద్దు చేసినట్లు ఎయిరిండియా బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. మంగళవారం రాత్రి నుంచి తమ సిబ్బందిలో కొందరు అస్వస్థతకు గురైయ్యారని తెలిపింది.
దేశీయ విమాన సర్వీసుల్లో ఎకానమీ క్లాసులో ఉచిత బ్యాగేజీ పరిమితిని తగ్గిస్తూ టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ నిర్ణయం తీసుకుంది.
లగేజీ తరలింపులో ఎయిర్ ఇండియా సిబ్బంది అశ్రద్ధను వీడియోతో సహా రుజువు చేసిన ఓ ప్రయాణికుడు సంస్థ యాజమాన్యంపై మండిపడ్డాడు.
ఇజ్రాయెల్- ఇరాన్(israel-iran) దేశాల మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అనేక ప్రధాన విమానయాన సంస్థలు ఇరాన్‌కు విమానాలను రద్దు చేశాయి. దీంతోపాటు ఇజ్రాయెల్‌కు కూడా గగనతల వినియోగాన్ని పరిమితం చేశాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్ ఇండియా, విస్తారా విమాన(flights) మార్గాల ప్రయాణంపై ప్రకటనలు విడుదల చేశాయి.
అదనపు చార్జీ చెల్లించి విండో సీటు బుక్ చేసుకున్న ఎయిర్ ఇండియా ప్రయాణికుడు పాడైన సీటులో కూర్చోవాల్సి వచ్చింనందుకు మండిపడ్డాడు. సంస్థపై విమర్శలు గుప్పిస్తూ నెట్టింట పోస్ట్ పెట్టాడు.
ఫైలట్లు, సిబ్బంది కొరత సహా ఇతర కారణాల వల్ల విమానాలను తగ్గిస్తున్నామని విస్తారా ఎయిర్ లైన్స్ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. గత కొన్నిరోజులుగా విమానాల ఆలస్యానికి గల కారణం ఇదేనని కంపెనీ ప్రతినిధి ఒకరు వివరించారు. కొన్ని దేశీయ మార్గాలలో ఎక్కువ మంది ప్రయాణికులను గమ్యస్థానం చేర్చేందుకు బోయింగ్ 787 లాంటి పెద్ద విమానాల ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.
కోల్‌కతా ఎయిర్‌పోర్టులో బుధవారం భారీ ప్రమాదం తప్పింది. రన్‌వే పై రెండు విమానాలు అత్యంత చేరువగా రావడంతో.. వింగ్ టు వింగ్ ఢీకొన్నాయి. దీంతో.. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాల రెక్కలు విరిగాయి. ఒక విమానం చెన్నైకి వెళ్తుండగా, మరొకటి దర్భంగాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో.. ఈ ఘటన చోటు చేసుకుంది.