Viral: ఇది ఎర్ర బస్సా..ఎయిర్ ఇండియా విమానమా.. నెట్టింట వైరల్‌గా మారిన ఉదంతం
ABN , Publish Date - Apr 07 , 2024 | 04:38 PM
అదనపు చార్జీ చెల్లించి విండో సీటు బుక్ చేసుకున్న ఎయిర్ ఇండియా ప్రయాణికుడు పాడైన సీటులో కూర్చోవాల్సి వచ్చింనందుకు మండిపడ్డాడు. సంస్థపై విమర్శలు గుప్పిస్తూ నెట్టింట పోస్ట్ పెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్ ఇండియా విమానంలో అదనపు చార్జీ చెల్లించి కిటికీ పక్కన సీటు బుక్ చేసుకున్న ఓ ప్రయాణికుడికి చివరకు భారీ షాక్ తగిలింది. తనకెదురైన పరిస్థితిని వివరిస్తూ అతడు నెట్టింట పెట్టిన పోస్టు వైరల్‌గా (Viral) మారింది. నెటిజన్లు కూడా ఆ ప్రయాణికుడికి మద్దతుగా నిలిచారు. దీంతో, ఎయిర్ ఇండియానే (Air India) చివరకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
Viral: మండుటెండలో పెట్రోల్ బంక్‌కు వచ్చిన కుక్క ఏం చేసిందో చూస్తే..
ఓ వ్యక్తి ఢిల్లీ నుంచి బెంగళూరుకు ఎయిర్ ఇండియా విమానం టిక్కెట్టు బుక్ చేసుకున్నాడు. విండో సీటు కోసం అతడు వెయ్యి రూపాయలు అదనంగా చెల్లించాడు. అంతా రెడీ అనుకుని విమానం ఎక్కిన అతడికి ఊహించని షాక్ తగిలింది. అతడికి కేటాయించిన సీటు సరిగా లేకపోవడంతో కూర్చులేక ఇబ్బంది పడ్డాడు (Air Indian Passenger Complains about broken seat). విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో వారు ఇంజినీర్‌ను రప్పించి సీటును బాగు చేయించే ప్రయత్నం చేశారు. కానీ, ఇంజినీరు చేయగలిగింది ఏమీ లేకపోవడంతో తాను అలాగే ఇబ్బంది పడుతూ ప్రయాణించాల్సి వచ్చిందని ప్రయాణికుడు చెప్పాడు. ఈ మేరకు నెట్టింట పోస్టు పెట్టాడు.
Viral: చిరుతకే షాకిచ్చిన రైతు.. బిత్తరపోయిన క్రూర మృగం.. వైరల్ వీడియో
ఇదంతా చదివిన నెటిజన్లు ఎయిర్ ఇండియాపై భగ్గుమన్నారు. ఇది సాధారణ బస్సా లేక విమానమా? అంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కన్జ్యూమర్ ఫోరంకు ఫిర్యాదు చేయాలని కొందరు సూచించారు. రిఫండ్ కోసం డిమాండ్ చేయాలని కొందరు సూచించారు. మరికొందరేమో తమకెదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. విషయం వైరల్ కావడంతో ఎయిర్ ఇండియా కూడా స్పందించి ప్యాసెంజర్‌కు క్షమాపణలు చెప్పింది (Air India Apologizes). అతడి టిక్కెట్ వివరాలు చెబితే సమస్యకు తగు పరిష్కారం చూపిస్తామని పేర్కొంది.
Viral: అర్ధరాత్రి విమానం దిగిన మహిళ..ఎయిర్‌పోర్టులో క్యాబ్ బుక్ చేస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి