Home » Alluri Seetharamaraju
ద్విచక్ర వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకుపోవడంతో తండ్రి, కొడుకు మృతిచెందారు. అదే వాహనంపై ఉన్న తల్లి, కూతురు తీవ్రంగా గాయపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చింతవానిపాలెంలో శుక్రవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి.
అల్లూరు జిల్లా జి.కె.వీధి మండలం పనసలబంద గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టు డంప్(Maoist dump) స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా(Tuhin Sinha) వెల్లడించారు. కూంబింగ్ చేస్తున్న పోలీస్ పార్టీలే లక్ష్యంగా డంప్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మందుపాత్రలు, పేలుడు పదార్థాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ భావజాలంతో కూడిన విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఏపీలో నేటి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు(ap elections 2024) పోలింగ్(polling) కోసం సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు అనేక ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది. కానీ అల్లూరి జిల్లా(Alluri Sitharama Raju district)లోని మూడు నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు.
Andhra Pradesh: అల్లూరి జిల్లా(Alluri Sitarama Raju District) పాడేరులో(Paderu) దారుణం చోటు చేసుకుంది. ఓ కానిస్టేబుల్ భర్తను అత్యంత క్రూరంగా హతమార్చారు దుండగులు. రాత్రివేళ ఇంటి మిద్దెపై పడుకున్న వ్యక్తిని.. దారుణంగా నరికి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకం రేపింది. అసలు ఈ హత్యకు కారణాలేంటి?
Andhrapradesh: రోడ్డు మార్గం సరిగా లేని ప్రాంతాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారి పరిస్థితి వర్ణణాతీతం. ఎలాగోలా వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి బతికించుకోవాలని కుటుంబసభ్యులు ప్రయత్నిస్తుంటారు. అయితే అదృశ్యం బాగుండి వారు ప్రాణాలతో బయటపడితే సంతోషం. అదే తీవ్ర అనారోగ్యంతో మరణిస్తే కుటుంబసభ్యుల బాధ చెప్పరానిది. అయితే చనిపోయిన వారిని తమ స్వంత గ్రామాలకు తీసుకెళ్లడమే వీరిక ఒక సవాల్‌గా ఉంటుంది. రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో వావహనాలు వెళ్లే దారి లేక... చనిపోయిన వారిని భుజాల మీదే మోసుకెళ్తుంటారు. ఇలాంటి హృదయ విదారక ఘటన అల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
అరకులోయ: అల్లూరి ఏజెన్సీలో డోలీ మోతలు కొనసాగుతున్నాయి. ఏజెన్సీలో సంపూర్ణమైన రోడ్డు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో గిరిజనులకు డోలీ మోతలు తప్పడంలేదు. వైద్య సదుపాయం కోసం అరకులోయ పరిసర ప్రాంతాల ప్రజలు డోలీ మోతలు కొనసాగిస్తున్నారు.
అల్లూరి జిల్లా: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నేతృత్వంలో ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో బస్సుయాత్ర జరగనుంది. ఈ సందర్భంగా కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు సమాధిని రామకృష్ణ సందర్శించనున్నారు.