Share News

Ram Mandir : మావోయిస్టుల గ్రామంలో రాములోరి గుడి

ABN , Publish Date - Jan 25 , 2025 | 05:21 AM

ఇటీవల మావోయిస్టు ప్రభావాన్ని నియంత్రించే క్రమంలో అక్కడ సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు ఏర్పాటు చేశారు.

Ram Mandir : మావోయిస్టుల గ్రామంలో రాములోరి గుడి

చింతూరు, జనవరి 24(ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం అల్లిగూడెంలో సీఆర్‌పీఎఫ్‌ నేతృత్వంలో రామమందిరం నిర్మించారు. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దును ఆనుకొని ఉన్న అల్లిగూడెం మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ఒకటి. ఇటీవల మావోయిస్టు ప్రభావాన్ని నియంత్రించే క్రమంలో అక్కడ సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. కాగా ఇదే గ్రామంలో సీఆర్‌పీఎఫ్‌ నిధులతో రామమందిరం కూడా నిర్మించారు. శుక్రవారం సీఆర్‌పీఎఫ్‌ 141 బెటాలియన్‌ కమాండెంట్‌ రితీష్‌ ఠాకూర్‌ పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించి మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్‌ అధికారి హేమంత్‌ కుమార్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 05:21 AM