Home » Amaravati
వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి సర్కారు వచ్చి వంద రోజులు దాటిపోయింది. ఇప్పటికీ కొందరు అధికారుల తీరు మాత్రం మారడం లేదు. నాడు జగన్ నోటి మాటనే శాసనంగా భావించి అడ్డగోలు పనులు చేశారు. వారు ఇప్పుడూ వైసీపీ నీడ నుంచి బయటపడటంలేదు.
పోలవరం సాగునీటి ప్రాజెక్టు తొలిదశ 41.15 మీటర్ల కాంటూరులో నీటిని నిల్వ చేసే పనులు 2027 మార్చినాటికి పూర్తి చేయాల్సిందేనని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అతుల్ జైన్ స్పష్టం చేశారు.
వైఖ రి మార్చుకోకపోతే నష్టపోతారని, పార్టీ నాయకులతో తరచూ వివాదాలకు దిగడం శ్రేయస్కరం కాదని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు పార్టీ పెద్దలు హెచ్చరించారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మాజీ మంత్రి, సింహాచలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ అశోక్ గజపతిరాజు అన్నారు.
Andhrapradesh: ఆర్వోబీలు, ఆర్యూబీలు అభివృద్ధి చేయాలని కోరామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. గత ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే పెండింగ్లో ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారన్నారు.
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇస్తోంది.
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వంసిద్ధమైంది. పది రోజుల పాటు అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. తొలిరోజు గురువారం అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిని విద్యుత్ వెలుగులతో అందంగా ముస్తాబు చేశారు.
స్వరాజ్యం సాధించిన బాపూజీ.. కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేయడమే మన కర్తవ్యమని, సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి అని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డి తమ ఆయుధాలను పోలీసులు తీసుకున్నారంటూ హైకోర్టును ఆశ్రయించారు. వాటిని తిరిగి ఇచ్చేలా ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.
విజయనగరం, అన్నమయ్య జిల్లాల్లో 97శాతానికి పైగా పింఛన్లు పంపిణీ పూర్తి చేశారు. తిరుపతి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, కర్నూల్, చిత్తూరు, అనంతపురం, కృష్ణా, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 96శాతానికి పైగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.