Share News

Anitha: విద్యార్థిని మరణం విషాదకరం: హోం మంత్రి అనిత

ABN , Publish Date - Oct 20 , 2024 | 12:42 PM

ఇంటర్ చదువుతున్న బాలిక దస్తగిరమ్మపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన విఘ్నేష్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో నాలుగు బృందాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి అరెస్ట్ చేశారన్నారు.

Anitha: విద్యార్థిని మరణం విషాదకరం: హోం మంత్రి అనిత

అమరావతి: కడపజిల్లాలో పెట్రోల్ దాడికి గురైన విద్యార్థిని (Student) మరణం (Death) విషాదకరమని హోం మంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) విచారం వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడి కోలుకోలేక ఆస్పత్రిలో మృతి చెందడం చాలా దిగ్భ్రాంతికరమని అన్నారు. బాలికపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన విఘ్నేష్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో నాలుగు బృందాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి అరెస్ట్ చేశారన్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని, అందుకు సహకరించిన వారిని చట్టప్రకారం వెంటనే కఠిన శిక్షపడేలా చేస్తామని, బాధితురాలి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.


పూర్తి వివరాలు..

కడప జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. బాలిక బట్టలకు నిప్పంటించి ఆమెను ఘోరంగా హత్య చేశాడు. బద్వేల్ పట్టణానికి చెందిన ఓ యువకుడికి ఆరు నెలలు క్రితం పెళైంది. అయినా మాజీ ప్రేయసినే కావాలనుకున్నాడు. మాయమాటలు చెప్పి ఆమెను ఒంటరిగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. బాలిక ఒప్పుకోకపోవడంతో నిప్పంటించి పరారయ్యాడు. తీవ్రగాయాలై.. దాదాపు 80 శాతం కాలిపోయిన బాలికను స్థానికులు కడప రిమ్స్‌కు తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

విద్యార్థిని వాంగ్మూలం సేకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన గురించి తెలుసుకున్న సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వెంటనే కడప ఎస్పీ హర్షవర్ధన్‌రాజుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలి పరిస్థితి గురించి ఆరా తీశారు. నిందితుడిని వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు నిందితుడు విఘ్నేష్‌ను పట్టుకునేందుకు ఎస్పీ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే తీవ్రంగా గాయపడి ప్రాణాలు నిలుపుకునేందుకు పోరాటం చేసిన యువతి ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది.


నిందితుడి వెంటనే శిక్షించాలి: సీఎం చంద్రబాబు

ఇంటర్ విద్యార్థిని మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బద్వేల్ ఘటనలో నిందితుడిని వెంటనే శిక్షించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేయాలని, నేరస్తుడికి మరణ శిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. మహిళలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

మృతిరాలి వాంగ్మూలం..

మృతురాలు దస్తగిరమ్మ చనిపోయే ముందు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. స్ధానిక విఘ్నష్‌తో తనకు పరిచయం వుందని, తనతో మాట్లాడాలి రావాలని, రాకపోతె చనిపోతానని బెదిరిస్తే తాను ఆటోలో అటవీప్రాంతానికి వెళ్ళానంది. పెళ్లి చేసుకుంటానని తనను ఒత్తిడి చేశాడని, విఘ్నేష్‌కు ముందే వివాహం కావడంతో తాను విభేదించానని చెప్పానంది. దీంతో తన వద్ద వున్న లైటర్‌తో డ్రెస్‌కు నిప్పంటించి పరారయ్యాడని దస్త గిరమ్మ వాంగ్మూలం ఇచ్చింది. కాగా ఇంటర్ విద్యార్థిని దస్త గిరమ్మ హత్య ఘటనపై ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు ఉద్యమాలకు సిద్ధమయ్యాయి. నగరంలోని రిమ్స్ ఆసుపత్రి మార్చురీ వద్దకు పలు ప్రజాసంఘాలు చేరుకుంటున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

దివ్వెల మాధురికీ తిరుమల పొలీసుల నోటీసులు..

గ్రూప్1 పరీక్షలకు లైన్ క్లియర్

అమరావతికి నిధులు వస్తున్నాయి..

టీటీడీ టిక్కెట్లను రూ. 65 వేలకు విక్రయించిన వైసీపీ ఎమ్మెల్సీ

నిండు గర్భిణిని.. ఐదు కిలోమీటర్ల డోలీ మోత..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 20 , 2024 | 12:42 PM