Home » America
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈరోజు కాగ్నిజెంట్ సీఈఓతో సీఎం భేటీ అవుతారు. సిగ్న కంపెనీ సీనియర్లతో రేవంత్ చర్చలు జరుపనున్నారు. అమెరికాలో ఉన్న కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియాతో లంచ్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. అలాగే పలు కంపెనీల ఓనర్లతో తెలంగాణ ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఎన్ఆర్ఐ లు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
చినికి చినికి గాలివానగా మారిందన్న సామెత చందంగా.. ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణ ఇరాన్ ప్రవేశంతో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితి కనిపిస్తోంది! ఇజ్రాయెల్‌కు అండగా రంగంలోకి దిగేందుకు అమెరికా ఇప్పటికే సిద్ధం కాగా..
మొదటి భార్యతో కాపురం చేసిన సమయంలో తనకు వివాహేతర సంబంధం ఉండేదని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ భర్త డగ్ ఎమ్హాఫ్ అంగీకరించారు. కమలా హారీస్ ఆయనకు రెండో భార్య కావడం గమనార్హం.
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లే వ్యవసాయ విద్య విద్యార్థులకు వ్యవసాయ శాఖ ఫెలోషి్‌పను అందించనుంది.
అసలే ఉద్రిక్తతలకు నెలవైన పశ్చిమాసియాలో ఓవైపు హమా్‌స-ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుండగానే, మరో యుద్ధం తప్పదనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Tana Foundation: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయూత కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో ఆగస్టు 3వ తేదీ శనివారం నాడు 50 మంది విద్యార్థినీ విద్యార్థులకు స్కాలర్ షిప్‌లను పంపిణీ చేశారు.
అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య ఫస్ట్ డిబేట్‌కు తేదీ ఫిక్స్ అయ్యింది. రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ బరిలోకి దిగగా, డెమోక్రాట్ల తరఫున హారిస్ ఉన్నారు. వాస్తవానికి జో బైడెన్ బరిలోకి దిగారు. వయస్సు పైబడటం, మతి మరుపు వల్ల ట్రంప్‌తో సమానంగా చర్చ చేయడం లేదు. దీంతో డెమోక్రాట్లు బైడెన్‌ను అధ్యక్ష ఎన్నిక బరి నుంచి తప్పుకోవాలని కోరారు. దాంతో బైడెన్ అధ్యక్ష ఎన్నిక నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. డెమోక్రాట తరఫున అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ దాదాపుగా ఖరారయ్యారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకెళుతున్నారు. ప్రత్యర్థి డెమోక్రట్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ లక్ష్యంగా మాటల తూటాలు పేలుస్తున్నారు. పనిలో పనిగా కార్పొరేట్ బాస్‌లను తనవైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటున్నానని జో బైడెన్ ప్రకటించారు. వయోభారం, ఆరోగ్య సమస్యలతో దూరంగా ఉంటానని వివరించారు. బైడెన్ తర్వాత అధ్యక్ష రేసులో వినిపించిన పేరు కమలా హారిస్. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. భారతీయ మూలాలు ఉన్న మహిళా నేత. పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రతినిధుల ఓట్లను వర్చువల్ విధానంలో తీసుకుంటున్నారు.
భారత్‌లో 80 కోట్ల మంది ప్రజలు కేవలం ఐదారేళ్లలోనే పేదరికం నుంచి బయటపడ్డారని ఐక్యరాజ్యసమితి(ఐరాస) జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఏ) అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ తెలిపారు.