Share News

CM Revanth Reddy: అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ బిజీబిజీ

ABN , Publish Date - Aug 05 , 2024 | 09:27 AM

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈరోజు కాగ్నిజెంట్ సీఈఓతో సీఎం భేటీ అవుతారు. సిగ్న కంపెనీ సీనియర్‌లతో రేవంత్ చర్చలు జరుపనున్నారు. అమెరికాలో ఉన్న కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియాతో లంచ్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. అలాగే పలు కంపెనీల ఓనర్లతో తెలంగాణ ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఎన్ఆర్ఐ లు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

CM Revanth Reddy: అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ బిజీబిజీ
CM Revanth Reddy

వాషింగ్టన్, ఆగస్టు 5: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అమెరికా పర్యటనలో (America Tour) బిజీబిజీగా ఉన్నారు. ఈరోజు కాగ్నిజెంట్ సీఈఓతో సీఎం భేటీ అవుతారు. సిగ్న కంపెనీ సీనియర్‌లతో రేవంత్ చర్చలు జరుపనున్నారు. అమెరికాలో ఉన్న కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియాతో లంచ్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. అలాగే పలు కంపెనీల ఓనర్లతో తెలంగాణ ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఎన్ఆర్ఐ లు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ విజయంలో ఎన్ఆర్ఐల సహకారం ఉందని రేవంత్ పేర్కొన్నారు. పదేండ్లలో వందేండ్ల విధ్వంసం జరిగిందని విమర్శించారు. ఎనిమిది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను ఎన్ఆర్ఐలకు సీఎం వివరిస్తున్నారు. బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని వ్యాఖ్యానించారు. అలాగే ఉచితాలపైనా రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Teharan : మూడో ప్రపంచ యుద్ధం.. ముప్పు అంచున?


కాగా.. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా.. సీఎం రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటన కొనసాగుతోంది. పది రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, పలువురు ఉన్నతాధికారులు కూడా వెళ్తున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి న్యూయార్క్‌కు సీఎం బయలుదేరి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నానికి న్యూయార్క్‌ నగరానికి చేరుకున్నారు. న్యూయార్క్‌ ఎయిర్‌పోర్టులో రేవంత్‌ బృందానికి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. న్యూయార్క్‌లో ఆరు రోజుల పర్యటన తర్వాత దక్షిణ కొరియాకు వెళ్తారు. ఈ పది రోజుల పాటు పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొననున్నారు. రూ.50 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు ఉంటాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

YS Jagan : గోబెల్సే సిగ్గుపడేలా..



ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమల రంగంలో ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పలు అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో కంపెనీల అధిపతులతో సీఎం నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది. ఇందులో అమెజాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, కాగ్నిజెంట్‌ సీఈవో, ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ సీవోవో, పెప్సీ కో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన దిగ్గజాలున్నారు. 6న వాషింగ్టన్‌లోని ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితోనూ సీఎం భేటీ కానున్నారు. మూసీ ప్రాజెక్టుతోపాటు రాష్ట్రంలో చేపడుతున్న ఇతర ప్రాజెక్టుల గురించి ఆయనకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించనున్నారు.


ఇవి కూడా చదవండి...

Youtube : యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు!

Rythu Runa Mafi: అక్షరం తేడా ఉన్నా.. మాఫీ కాని రుణం!
Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 05 , 2024 | 10:10 AM