Kamala Harris: డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కన్ఫామ్..!!
ABN , Publish Date - Aug 03 , 2024 | 08:40 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటున్నానని జో బైడెన్ ప్రకటించారు. వయోభారం, ఆరోగ్య సమస్యలతో దూరంగా ఉంటానని వివరించారు. బైడెన్ తర్వాత అధ్యక్ష రేసులో వినిపించిన పేరు కమలా హారిస్. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. భారతీయ మూలాలు ఉన్న మహిళా నేత. పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రతినిధుల ఓట్లను వర్చువల్ విధానంలో తీసుకుంటున్నారు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటున్నానని జో బైడెన్ ప్రకటించారు. వయోభారం, ఆరోగ్య సమస్యలతో దూరంగా ఉంటానని వివరించారు. బైడెన్ తర్వాత అధ్యక్ష రేసులో వినిపించిన పేరు కమలా హారిస్ (Kamala Harris). ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. భారతీయ మూలాలు ఉన్న మహిళా నేత. పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రతినిధుల ఓట్లను వర్చువల్ విధానంలో తీసుకుంటున్నారు. కమలా హారిస్ ఇప్పటికే మెజార్టీ ఓట్లు సాధించారని డెమోక్రటిక్ నేషనల్ కమిటీ ప్రకటించింది. వర్చువల్ విధానంలో ఓటింగ్ ప్రక్రియ సోమవారం వరకు కొనసాగనుంది. అధ్యక్ష రేసులో ఎవరూ లేకపోవడంతో కమలా హారిస్ ఎన్నిక లాంఛనం కానుంది.
హర్షం వ్యక్తం చేసిన కమల..
డెమోక్రాట్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక కావడంపై కమలా హారిస్ సంతోషం వ్యక్తం చేశారు. ‘నాకు అరుదైన అవకాశం కలిగింది. డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలవడాన్ని గౌరవంగా భావిస్తున్నా. దేశం పట్ల ప్రేమతో ఉంటా. దేశాన్ని అమితంగా ప్రేమిస్తాం, అమెరికా వాగ్దానాన్ని మరింత బలంగా నమ్ముతా. వర్చువల్ ఓటింగ్ నిర్దేశిత సమయం ముగిసిన తర్వాత అధ్యక్ష నామినేషన్‌ను నేను అంగీకరిస్తా. ఈ నెల 22వ తేదీన చికాగోలో సమావేశం అవుతాం. ఆ భేటీలో అందరం ఒక్కటై నిలబడతాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తాం అని’ కమలా హారిస్ ధీమా వ్యక్తం చేశారు.
ఇదే తొలిసారి..
ఇతర దేశ మూలాలు ఉన్న కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓ ప్రధాన పార్టీ నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఇంతకుముందు ఎవరూ కూడా అ విధంగా పోటీ చేయలేదు. చికాగోలో జరిగే డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ ప్రతినిధుల సమక్షంలో నామినేషన్ వేస్తారు. ఆ సమావేశంలోనే తన ఉపాధ్యక్ష అభ్యర్థిని ప్రకటిస్తారు. కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు మద్దతుగా నిలిచారు.
Read Latest International News and Telugu News