Home » Anam Ramanarayana Reddy
Andhrapradesh: ‘‘నాలుగు దశాబ్దాలుగా ఎన్నికలు జరిగితే.. మా అన్న ఆనం వివేకానంద రెడ్డి లేకుండా నేను పోటీచేసిన ఎన్నికలు ఇవి’’ అని ఆనం రాంనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం తన ఇంటి వద్ద సమావేశ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆనం పాల్గొని ప్రసంగించారు. అధికారులు ఈ ఎన్నికల్లో తమకు సహకరించలేదని.. అధికారపార్టీకి కొమ్ముకాశారని ఆరోపించారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 (AP Election 2024), లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ టీడీపీలోకి వలస జోరు అంతకంతకూ వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది కీలక నేతలు వైసీపీకి గుడ్‌బై చెప్పగా తాజాగా మరికొందరు టీడీపీకి గూటికి చేరారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఆనం రామనారాయణ రెడ్డి వ్యూహంతో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది.
గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొంది. అలాంటి పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఓ పక్క సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆ పార్టీ నేడు ఓటమి అంచున నిలబడిందంటే.. అందుకు నెల్లూరు జిల్లాలో నాడు చోటు చేసుకున్న వరుస పరిణామాల కారణంగానే ఆ పార్టీ నేడు ఈ పరిస్థితికి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.
సీఎం జగన్, భారతి వ్యాపారంలో అపర మేథావులని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరస్వతీ పవర్ కంపెనీ పేరుతో 1999లో కోటి పెట్టుబడి పెట్టి.. 2009లో రూ. 32 కోట్లుకు షేర్ క్యాపిటల్ చేశారని అన్నారు.
ఏపీలో అనర్హత రాజకీయం ఆగడం లేదు. మళ్లీ ఈ నెల 19 న స్పీకర్ వద్దకు విచారణకు రావాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీస్‌లు అందాయి. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపించింది.
ఇవాళ స్పీకర్ ముందుకు వ్యక్తిగతంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. వ్యక్తిగతంగా స్పీకర్‌కు వివరణ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాతపూర్వకంగా తమ వివరణను ఆనం రానారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఈ నెల 5న సమర్పించారు.
Andhrapradesh: అనర్హత పిటిషన్లపై విచారణకు హాజరుకావాలంటూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది. దీంతో ఈరోజు మధ్యాహ్నం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిశారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన లేఖకు రసీదు ఇవ్వాలని కోరగా.. ఇవ్వాల్సిన అవసరం లేదని స్పీకర్ అన్నారని తెలిపారు.
ఫిబ్రవరి చివరిలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంటే మొదటి వారంలోనే లక్షాముప్పైవేల ఎకరాల దోపిడీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే అనం రామనారాయణరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డితో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుధీర్ఘ చర్చలు నిర్వహించారు.
వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ( Anam Venkataramana Reddy ) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీలో మగాళ్లు లేరని.. టీడీపీలో దమ్ముండే నేతలని ఎదుర్కోలేక హిజ్రాలని పంపుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.