Share News

Anam Ramanarayana Reddy: జగన్ ప్రభుత్వంలో ఆ నిధులు స్వాహా

ABN , Publish Date - Feb 15 , 2025 | 01:01 PM

Anam Ramanarayana Reddy: జగన్ ప్రభుత్వంపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.

 Anam Ramanarayana Reddy: జగన్ ప్రభుత్వంలో ఆ నిధులు స్వాహా
Anam Ramanarayana Reddy

నెల్లూరు: దేశంలోనే పరిశుభ్రతలో ఏపీ నెంబర్ వన్‌గా ఉండాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ‘‘స్వచ్చ ఆంధ్రా - స్వచ్చ దివాస్’’ నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్రతి నెలా మూడో శనివారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. మన ఇళ్లు, ఇంటి పరిసరాలు, ఊరు పరిశుభ్రంగా ఉంటే దేశం శుభ్రంగా ఉంటుందని తెలిపారు. అధికారులు, కూటమి పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రజలను జాగృతం చేయాలని సూచించారు. గతంలో ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీసిందని అన్నారు. గడిచిన ఐదేళ్లుగా అభివృద్ధి నిలిచిపోయిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.


Anam-ramanarayana-reddy.jpg

బలహీనవర్గాల బాలికల గురుకుల పాఠశాలలను 60 మంది పిల్లలతో ప్రారంభించినట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గుర్తుచేశారు. ఎక్కడా లేని సౌకర్యాలు ఈ పాఠశాలల్లో కల్పించామని చెప్పారు. ప్రభుత్వం రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీని మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో మంజూరైన రెండింటిలో ఒకటి ఆత్మకూరుకు వచ్చిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూ.29కోట్లు నిధులు మంజూరు చేశాయని ప్రకటించారు. ఆత్మకూరులో వంద‌పడకల ఆస్పత్రిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయడానికి మంత్రి సత్యకుమార్ అంగీకరించారని అన్నారు. రెండు జాతీయ రహదారులను కలిపే ఆత్మకూరు - సోమశిల రోడ్డు, నెల్లూరుపాళెం - వింజమూరు, సంగం - కలిగిరి రోడ్లని అభివృద్ధి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.


రూ.25కోట్లతో ప్రతి పంచాయతీలో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. రూ.85కోట్లతో విద్యుత్తు సరఫరాకు అవసరమైన పనులు జరుగుతున్నాయని తెలిపారు‌. లిప్ట్ ఇరిగేషన్ సిస్టంలు పునర్నిర్మాణాలు జరుగుతాయని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఏపీలో రూ.10,50,000 కోట్ల అప్పులున్నాయని అన్నారు. జగన్ ప్రభుత్వంలో స్థానిక సంస్థల నిధులు రూ.1200కోట్ల మేర స్వాహా చేశారని విమర్శించారు‌. ఎంపీటీసీలు, సర్పంచులను కూడా మోసం చేశారని ఆరోపించారు. ఎన్ని లక్షల కోట్ల అప్పులున్నా, మెరుగైన పాలన సాగిస్తామని ఉద్ఘాటించారు. NREGS, 15th ఫైనాన్స్ నిధులను రాజకీయాలకు అతీతంగా పంచాయతీలకు ఇస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu : నేరుగా అర్జీదారుల వద్దకే!

Transgender Welfare: రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు

Nimmala Ramanaidu : ఆ ట్వీట్‌ జగన్‌ నేర స్వభావాన్ని చాటుతోంది

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 15 , 2025 | 04:44 PM