Share News

Anam: అభివృద్ధి వైపు ఏపీ అడుగులు

ABN , Publish Date - Jan 01 , 2025 | 01:37 PM

Andhrapradesh: నూతన సంవత్సరంలో పోలవరం పూర్తి చేసుకుంటామని, జలహారం.. సాగరమాల పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలని ప్రజలు పూజలు చేయాలని కోరారు.

Anam: అభివృద్ధి వైపు ఏపీ అడుగులు
AP Minister Anam Ramanarayana Reddy

నెల్లూరు, జనవరి 1: ‘‘2024 గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుదాం.. నూతన సంవత్సరానికి స్వాగతం’’ అని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి (Minister Anma Ramanarayana Reddy) అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లాలోని తల్పగిరి రంగనాధుడుని మంత్రి ఆనం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) నిరంతరం కష్టపడుతున్నారని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయన్నారు. వ్యవసాయపరంగా, పారిశ్రామికంగా అభివృద్ధి సాధిద్దామని అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని... స్వయం సమృద్ధి సాధించడానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికతో పని చేస్తోందని వెల్లడించారు. ఆర్ధికంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. యువత నూతన పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


నూతన సంవత్సరంలో పోలవరం పూర్తి చేసుకుంటామని.. జలహారం.. సాగరమాల పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలని ప్రజలు పూజలు చేయాలని కోరారు. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం రామాయపట్నం సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు.. రామాయపట్నం పోర్టు వద్ద బీపీసీల్ ప్రాజెక్ట్‌తో అభివృద్ధి చెందబోతుందన్నారు. దగదర్తి ఏయిర్ పోర్టును పూర్తి చేసుకుంటామని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి పేర్కొన్నారు.

Holidays: ఈ ఏడాది సెలవులు ఎప్పుడెప్పుడంటే.. ఆ నెలలో ఉద్యోగస్తులకు బంపర్ బొనంజా


దుర్గమ్మ సేవలో సీఎం

మరోవైపు విజయవాడ కనకదుర్గమ్మను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సీఎంకు ఘన స్వాగతం పలికి.. అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం చంద్రబాబు. ఏపీ‌ ప్రజలు, రాష్ట్రం అభివృద్ధి చెందేలా దుర్గమ్మ చల్లని చూపు మనకి ఉందన్నారు. అందరికీ ఆదాయం పెరిగి, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అందరికీ శుభం జరుగాలని, మంచి‌ జరగాలని దుర్గమ్మను ప్రార్ధించానన్నారు. తెలుగు వారికి మంచి జరగేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. భవిష్యత్తు మన తెలుగు వాళ్లదే, త్వరలోనే మరింత మంచిని చూస్తారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అలాగే ముఖ్యమంత్రికి టీటీడీ అర్చకులు వేద ఆశీర్వదాలు అందజేశారు. అలాగే స్వామి వారి ఫోటో, క్యాలెండర్, డైరిని సీఎంకు టీటీడీ ఈవో అందజేశారు.


ఇవి కూడా చదవండి..

ఇతగాడి దెబ్బకు బ్రీత్ ఎనలైజర్ వణికిపోయిందిగా

న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Read Latest AP News And Telugu news

Updated Date - Jan 01 , 2025 | 01:37 PM