Home » Andhrajyothi
వారు అమ్మేది చెప్పులు.. కానీ, వారి వద్ద ఉన్న సంపద కోట్లు.. అవును, వారి వద్ద ఉన్న నోట్ల కట్టలు చూసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఖంగుతిన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 40 కోట్ల నగదు పట్టుబడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది.
శ్రీ తాతయ్య గుంట ‘‘గంగమ్మ జాతర’’ ఈరోజు (బుధవారం) ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతరలో బైరాగి వేషంలో భక్తులు గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. నేటి నుంచి ఈనెల 21వ తేదీ వరకు ఈ జాతర అత్యంత వైభవంగా జరుగనున్నది. నేటి నుంచి రోజుకో వేషంలో గ్రామదేవతకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.
దేశంలో ఎన్నికల వేళ తప్పుడు ప్రచారంతో కొన్ని పార్టీలు, కొంత మంది వ్యక్తులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజల మైండ్ డైవర్ట్ చేసేందుకు ఇతర పార్టీలపై బురద జల్లేందుకు ఫేక్ వార్తలను సృష్టిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు ఎక్కువుగా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేస్తూ తప్పుడు వార్తలను సామాజిక మాద్యమాల్లో వ్యాప్తిచేస్తున్నారు.
రోహిత్ వేముల ముమ్మాటికీ ఎస్సీనే అని ఆయన తల్లి రాధిక(Radhika) స్పష్టం చేశారు. పోలీసులు రోహిత్ వేముల(Rohit Vemula) కులం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ వేముల ఎస్సీ కాదని, చదవలేక చనిపోయారని పోలీసులు(Telangana Police) రిపోర్టులో పేర్కొన్నారని, ఇది పచ్చి అబద్ధం అని పేర్కొన్నారు.
ABN Andhrajyothi: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. విజేతలను నిర్ణయించేది ప్రజలే. ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీకి అధికారం ఇవ్వాలో ఓటు హక్కు ద్వారా ఓటర్లు నిర్ణయించనున్నారు. నాయకుల రాజకీయ భవితవ్యాన్ని తేల్చేది ప్రజలే. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులే కాదు.. ఓట్లు వేసి గెలిపించే మీరు విజేతలు అయ్యే అవకాశం ఆంధ్రజ్యోతి మీకు కల్పిస్తుంది. మీ అంచనా వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంటే మీరు లక్షాధికారి కావచ్చు. ఏపీ ప్రజలను విజేతలు చేసేందుకు ఆంధ్రజ్యోతి సరికొత్త కాన్సెప్ట్‌తో మీ ముందుకు వస్తుంది.
పిఠాపురం... ఒకప్పుడు దక్షిణ భారత దేశంలో అతి పెద్ద సంస్థానాల్లో ఒకటి. కానీ ఇప్పుడు దాని చరిత్ర గురించి తెలిసిన వారు తక్కువే
నేరాలు, ఘోరాలు, అరాచకాల్లో సీఎం జగన్ రెడ్డి (CM Jagan) పీహెచ్డీ చేశారని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆరోపించారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని.. మనల్ని మనం కాపాడుకోవాలంటే అందరం కర్రలు చేతపట్టి రోడ్ల మీదకి రావాలని పిలుపునిచ్చారు. రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తాం.. వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీలో మళ్లీ అరాచకం సృష్టిస్తుందని చంద్రబాబు విరుచుకుపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan) ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోపై మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. పేద వాడి జీవన ప్రమాణాలకు అనుగుణంగా తమ మేనిఫెస్టో ఉందని అన్నారు.
ఓటమి భయంతో వైసీపీ (YSRCP) నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దెందులూరు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) అన్నారు. దెందులూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. శనివారం నాడు దెందులూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై చింతమనేని ప్రభాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి(YS Viveka) సతీమణి సౌభాగ్యమ్మ(YS Sowbhagyamma).. సీఎం జగన్‌కు(CM YS Jagan) బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో సంచలన విషయాలు పేర్కొన్నారు సౌభాగ్యమ్మ. తండ్రిని కోల్పోయిన సునీత(YS Sunitha) ఎంత మనోవేదనకు గురయ్యారో ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు..