Share News

AP Elections 2024: ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాలు చేస్తున్న వైసీపీ: చింతమనేని ప్రభాకర్

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:12 PM

ఓటమి భయంతో వైసీపీ (YSRCP) నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దెందులూరు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) అన్నారు. దెందులూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. శనివారం నాడు దెందులూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై చింతమనేని ప్రభాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

 AP Elections 2024: ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాలు చేస్తున్న వైసీపీ:   చింతమనేని ప్రభాకర్
Chintamaneni Prabhakar

ఏలూరు జిల్లా: ఓటమి భయంతో వైసీపీ (YSRCP) నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దెందులూరు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) అన్నారు. దెందులూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. శనివారం నాడు దెందులూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై చింతమనేని ప్రభాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.


AP Elections: కొత్త స్కీం లేదు.. మెరుపులు లేవు.. తేలిపోయిన వైసీపీ మేనిఫెస్టో

పెదవేగి మండలం లక్ష్మీపురంలో జరిగిన దాడి హేయనీయమన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఆ పార్టీ నేతలు అమాయకులపై దాడి చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. లక్ష్మీపురంలో టీడీపీ నేతలు దాడి చేయించినట్లు వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని రోజులు టీడీపీపై ఇలా అసత్యాలు ప్రచారం చేస్తారని ప్రశ్నించారు.


AP Elections 2024: రాజధానిపై జగన్ నిర్ణయం ఇదే.. అమరావతిపై మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే!

ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. తమపై నిరాధార ఆరోపణలు చేసి అప్రతిష్ఠ పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చే నెల 13వ తేదీన దెందులూరు నియోజకవర్గ ప్రజలు టీడీపీ కూటమికి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలందరూ ఆమోదించారని తెలిపారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న నేతలకి ప్రజలే బుద్ధి చెబుతారని చింతమనేని ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు.


AP Elections: సిగ్గు, సంస్కారం వదిలేశారు.. జగన్‌పై షర్మిల సంచలన కామెంట్స్..

AP Elections: వైసీపీ మేనిఫెస్టో: నాడు - నేడు

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - Apr 27 , 2024 | 04:22 PM