Share News

Laksha Meede: బంపర్ ఆఫర్.. కూపన్ నింపితే లక్ష మీదే..

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:59 AM

ABN Andhrajyothi: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. విజేతలను నిర్ణయించేది ప్రజలే. ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీకి అధికారం ఇవ్వాలో ఓటు హక్కు ద్వారా ఓటర్లు నిర్ణయించనున్నారు. నాయకుల రాజకీయ భవితవ్యాన్ని తేల్చేది ప్రజలే. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులే కాదు.. ఓట్లు వేసి గెలిపించే మీరు విజేతలు అయ్యే అవకాశం ఆంధ్రజ్యోతి మీకు కల్పిస్తుంది. మీ అంచనా వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంటే మీరు లక్షాధికారి కావచ్చు. ఏపీ ప్రజలను విజేతలు చేసేందుకు ఆంధ్రజ్యోతి సరికొత్త కాన్సెప్ట్‌తో మీ ముందుకు వస్తుంది.

Laksha Meede: బంపర్ ఆఫర్.. కూపన్ నింపితే లక్ష మీదే..
TDP, YCP, BJP, Janasena, Congress

ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. విజేతలను నిర్ణయించేది ప్రజలే. ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీకి అధికారం ఇవ్వాలో ఓటు హక్కు ద్వారా ఓటర్లు నిర్ణయించనున్నారు. నాయకుల రాజకీయ భవితవ్యాన్ని తేల్చేది ప్రజలే. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులే కాదు.. ఓట్లు వేసి గెలిపించే మీరు విజేతలు అయ్యే అవకాశం ఆంధ్రజ్యోతి మీకు కల్పిస్తుంది. మీ అంచనా వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంటే మీరు లక్షాధికారి కావచ్చు. ఏపీ ప్రజలను విజేతలు చేసేందుకు ఆంధ్రజ్యోతి సరికొత్త కాన్సెప్ట్‌తో మీ ముందుకు వస్తుంది.


ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో ఏపార్టీ అధికారంలోకి వస్తుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనేదానిపై తలపండిన రాజకీయ పండితులే స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ప్రజల నాడిని పట్టుకోవడం ఎవరి తరం కావడంలేదు. కానీ నాయకుల భవితవ్యాన్ని నిర్ణయించే ప్రజలకు తప్పా.. వారి నాడి ఇంకెవరికి తెలుస్తుంది. అందుకే ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో గెస్ చేయండి.. నగదు బహుమతులు గెలుచుకోండి.. మీ అంచనా ఫలితాలకు దగ్గరగా ఉంటే మీరు లక్షాధికారి కావచ్చు. అంతేకాదు మొత్తం 59 మంది విజేతలను ఎంపిక చేసి వారికి నగదు బహుమతులు అందజేస్తాము.

WhatsApp Image 2024-04-30 at 10.57.26 AM.jpeg

AP Elections: సొంత ఇలాకాలో సాక్షాత్తు సీఎం జగన్ సతీమణికి చేదు అనుభవం..


గెలిచేదెవరు..

రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేదానికి ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి/కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనే అంచనాలను ప్రజల నుంచే ఆహ్వానించాలని ఆంధ్రజ్యోతి నిర్ణయించింది. ఈ అంచనాలను వాస్తవ ఫలితాలతో పోల్చి చూసి.. వాస్తవానికి దగ్గరగా అంచనా వేసిన పాఠకులకు 59 మందికి రూ.5,25,000/- లు బహుమతుల్ని అందజేయనుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఈ పోటీ జరుగుతుంది. రాష్ట్రంలో ఏ పార్టీ/కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో వాస్తవానికి అతి దగ్గరగా అంచనా వేసిన వారికి రూ.1,00,000 బహుమతిని అందజేస్తాం. రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.50,000 బహుమతి ఉంటుంది. ఆ తర్వాతి స్థానంలో నిలిచిన అయిదుగురికి ఒక్కొక్కరికీ రూ.10,000 బహుమతిని అందిస్తాం.

WhatsApp Image 2024-04-30 at 10.57.27 AM.jpeg


జిల్లా స్థాయిలోనూ..

రాష్ట్రస్థాయిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు విజయం సాధిస్తారనే అంశంపై ఉమ్మడి జిల్లాల వారీగా బహుమతులు ఉంటాయి. మీ జిల్లాలోని ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఎవరు గెలుస్తారనేది మీరు ఊహించి సమాధానం పంపాల్సి ఉంటుంది. ఎక్కువ అసెంబ్లీ స్థానాలపై ఎవరు సరైన అంచనా వేస్తే వారే విజేతలవుతారు. ప్రతి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిన విజేతకు రూ. 10,000, రెండవ స్థానంలో నిలిచిన ముగ్గురు విజేతలకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున బహుమతి అందజేస్తాం.


కూపన్లు ఎలా పంపాలంటే

రాష్ట్రస్థాయి అంచనాలకు సంబంధించిన కూపన్ 'ఆంధ్రజ్యోతి' ప్రధాన సంచికలో, జిల్లా స్థాయి అంచనాలకు సంబంధించిన కూపన్ సంబంధిత జిల్లా ఎడిషన్లో ప్రచురితమవుతాయి. ప్రతి వారంలో రెండుసార్లు ఏదో ఒక రోజున ఈ కూపన్లు ప్రచురితమవుతాయి. ఆ వారంలో ప్రచురించిన రెండు కూపన్లు రాష్ట్రస్థాయి కూపను విజయవాడ కార్యాలయానికి, జిల్లా స్థాయి కూపనుపై మీ అంచనా రాసి ఆ జిల్లాలోని యూనిట్ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. వాస్తవానికి అతి దగ్గరగా ఉన్న కూపన్లు డ్రా తీసి విజేతలకు పైన తెలియజేసిన విధంగా బహుమతులు అందజేస్తాము. ఒక్కొక్కరూ ఎన్ని కూపన్లయినా పంపవచ్చు. మారుతున్న పరిస్థితుల్ని బట్టి తమ అంచనాలను మార్చుకోవచ్చు. వాటిలో వాస్తవానికి అతి దగ్గరగా ఉన్న కూపన్ ను బహుమతి కోసం పరిశీలనలోకి తీసుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ ఆలోచనలకు పదును పెట్టండి. కలం, కాగితం అందుకోండి.. అంచనాలతో సిద్ధం కండి. కూపన్ కోసం ఎదురు చూడండి. నగదు బహుమతులు గెల్చుకోండి.

WhatsApp Image 2024-04-30 at 10.57.27 AM (1).jpeg


మీరు కూడా ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్నఎవరూ గెలిచినా మీదే గెలుపు కాంటెస్ట్‌లో పాల్గొనాలంటే వెంటనే ఆంధ్రజ్యోతి చందాదారుడిగా చేరండి.. పేపర్‌లో వచ్చే కూపన్ పూర్తిచేసి పంపించండి.. లక్షాధికారి అవ్వండి. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు.. ఆంధ్రజ్యోతి పేపర్ కావాలనుకునేవారు వెంటనే మీ ఏరియాలో ఏజెంట్‌ను సంప్రదించి చందాదారుడు కండి.

Paper.jpg

గమనిక: ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురితమయ్యే కూపన్‌పై మాత్రమే మీ అంచనా రాసి పంపించాల్సి ఉంటుంది. ఆ కూపన్‌ను జిరాక్స్ లేదా కలర్ ప్రింట్ తీసి పంపించినచో అవి చెల్లవు.

Chandrababu: మారీశుడు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొందాం.. వైసీపీ కుట్రలను సాగనివ్వం

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 30 , 2024 | 06:58 PM