Home » Anurag Thakur
ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు, జమిలి ఎన్నికల కోసం ప్రయత్నాలు వంటివాటిని చూసి లోక్ సభ ఎన్నికలు ముందస్తుగానే జరిగే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు.
నరేంద్ర మోదీ వచ్చే ఏడాది తన ఇంట్లో జాతీయ జెండాను ఎగురవేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. 2014 ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ ఈ విధంగానే చెప్పిందని, అయినప్పటికీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు.
ఇండియన్ మీడియా సంస్థల్లో కొన్నిటికి చైనా నుంచి నిధులు అందుతున్నాయని ‘న్యూయార్క్ టైమ్స్’ ఓ కథనాన్ని ప్రచురించడంతో అలజడి మొదలైంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ కథనాన్ని ప్రస్తావిస్తూ, మీడియా న్యూస్ పోర్టల్ ‘న్యూస్ క్లిక్’కు చైనా నిధులు అందడాన్ని సమర్థించినందుకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు.
భారతదేశం(India) కథకులకు పుట్టినిల్లు అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్(Anurag Singh Thakur) చెప్పారు.
మణిపూర్ అంశంపై పార్లమెంట్లో జరిపే చర్చలో ప్రతిపక్షాలు పాల్గొనాలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేతులు జోడించి వేడుకున్నారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ ఆయన ప్రతిపక్షాలకు ఈ విజ్ఞప్తి చేశారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై రాజకీయం చేయొద్దని ఠాకూర్ ప్రతిపక్షాలను కోరారు.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు మంగళవారం తాత్కాలిక బెయిలును మంజూరు చేసింది.
చెరకు పండించే రైతులకు కేంద్రం తీపివార్త చెప్పింది. చెరకు 'ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజ్' ధరను క్వింటాల్‌కు రూ.10 పెంచింది. అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే 2023-24 సీజన్‌కు ఈ పెంపు వర్తిస్తుంది. ఆ ప్రకారం చెరకు రైతులకు మిల్లులు క్వింటాల్‌కు రూ.315 చెల్లించాల్సి ఉంటుంది.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఆరోపణలు చేసిన ‘మైనర్’ రెజ్లర్ కోర్టులో తన స్టేట్మెంట్ను సవరించారు.
రెజ్లర్లు చేపట్టిన ఆందోళన బుధవారంనాడు మరో కీలక మలుపు తిరిగింది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆహ్వానం మేరకు రెజర్లు బజ్రంగ్ పూనియా , సాక్షి మాలిక్ సుమారు ఆరు గంటల సేపు ఆయన నివాసంలో సమావేశమయ్యారు. 5 డిమాండ్లతో కూడిన లిఖిత పూర్వక ప్రతిపాదనను మంత్రికి రెజ్లర్లు సమర్పించగా, ఈనెల 15వ తేదీతో దర్యాప్తు పూర్తవుతుందని, అంతవరకూ వేచిచూడాలని మంత్రి రెజ్లర్లను కోరారు.
కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో రెజ్లర్ల చర్చలు బుధవారం ప్రారంభమయ్యాయి.