Home » AP Assembly Elections 2024
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసినా తర్వాత కూడా రాష్ట్రంలో వైసీపీ (YSRCP) అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఏపీ వ్యాప్తంగా వైసీపీ మూకలు పోలింగ్ రోజు(మే13) నుంచి భారీగా అల్లర్లు, అరాచకాలకు పాల్పడుతున్నాయి. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి వైసీపీ పెద్దఎత్తున దాడులకు ప్లాన్ చేసినట్లు ప్రతిపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు.
పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) అరాచకానికి అడ్డూ ఆదుపు ఉండదు! అయితే.. ఈ ఎన్నికల్లో ఓ మహిళ వీరనారిలా ముందుకొచ్చి ఆయనకు ఎదురు నిలిచారు. ఏజెంట్లుగా ఉండేందుకు పురుషులు తటపటాయిస్తున్న చోట ఏజెంట్‌గా కూర్చున్నారు. ఇది సహించలేక వైసీపీ (YSRCP) మూకలు ఆమెపై వేటకొడవళ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు.
జమ్మలమడుగు నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు144 సెక్షన్ అమలు చేశారు. అభ్యర్థులను, కీలక నేతలను పోలీసులు ఇళ్లకే పరిమితం చేశారు. నిజమ్మలమడుగులోని వైసీపీ, బీజేపీ, టీడీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి.
MCP (మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్) మల్టీస్టార్ మహా కూటమి ఎపీలో సూపర్ డూపర్ హిట్ అని టీడీపీ నేత బుద్దా వెంకన్న తెలిపారు. ఏపీలో కూటమి 130 సీట్లు పైగా కూటమి సీట్లు సాధించబోతోందన్నారు. 2019లో జగన్‌ను గెలిపించేందుకు బారులు తీరిన ప్రజలు ఐదేళ్లు ఇబ్బందులు పడ్డారన్నారు. ఇలాంటోడినా గెలిపించిందని ప్రజలు తెలుసుకుని ఈసారి ఓడించాలని కంకణం కట్టుకున్నారని బుద్దా వెంకన్న తెలిపారు.
ఎక్కడ ఓడిపోతామోనన్న భయాందోళనలు వైసీపీలో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ పార్టీకి ఓటు వేయని వారందరిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. పెళ్లకూరులో అరుణ అనే గర్భిణి, ఆమె సోదరుడిపై వైసీపీ గూండాలు విచక్షణారహితంగా దాడి చేశాయి. టీడీపీకి ఓటు వేసిందంటూ తీవ్రస్థాయిలో దుర్భాషలు ఆడటమే కాకుండా అరుణని కడుపు మీద కాళ్లతో తన్నారు.
ఓటమి భయంతో పిచ్చి పట్టి వైసీపీ నాయకులు దాడి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు (Atchannaidu) ఆరోపించారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ దాడిని అచ్చెన్న తీవ్రంగా ఖండించారు. పోలింగ్ బూత్‌ల వద్ద జనసునామీని చూసి ఓర్వలేకనే జగన్ రెడ్డి అతని గ్యాంగ్ దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు.
మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు పక్క రాష్ట్రం నుంచి గూండాలను పిలిపించి అల్లర్లు, అరాచకాలకు పాల్పడ్డారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు (Nakka Anand Babu) ఆరోపించారు. ఇప్పటికీ మాచర్లలో వైసీపీ గూండాలు దాడులకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై ఏపీ డీజీపీ హరీష్ గుప్తాకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఫిర్యాదు చేశారు. మంగళవారం డీజీపీకి చంద్రబాబు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
ఏపీలో పోలింగ్ ముగిసింది. జనం తమ తీర్పును ఈవీఎంలలో బంధించారు. దీంతో రాజకీయ పార్టీలు, నేతల్లో టెన్షన్ కొనసాగుతుండగా.. ఓటరు మాత్రం కూల్ అయిపోయాడు. తాను ఎలాంటి తీర్పు ఇవ్వాలనుకున్నాడో పోలింగ్ బూత్‌కు వెళ్లి తన తీర్పును రిజర్వు చేసి వచ్చాడు. జూన్4న అసలు తీర్పు వెల్లడికానుంది. ఓటరు ఏ పార్టీని ఆదరించాడనేది మరో 20 రోజుల్లో తెలుస్తుంది. అప్పటివరకు నాయకుల్లో టెన్షన్ కొనసాగనుంది.
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం మెషిన్లలో లాక్ అయింది. జూన్4 ఓట్ల లెక్కింపుతో గెలిచేదెవరో తేలిపోనుంది. పోలింగ్ వేళ కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార వైసీపీకి చెందిన నాయకులే ప్రత్యర్థులపై దాడికి దిగారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతో పోలింగ్ ప్రశాంతంగా జరగకుండా ఉండేందుకు దాడులకు పాల్పడ్డారని విమర్శిస్తున్నారు. మరోవైపు వైసీపీ మాత్రం టీడీపీనే ఘటనలకు కారణమని ఆరోపిస్తోంది.