AP Elections 2024: జమ్మలమడుగులో కీలక నేతలంతా ఇళ్లకే పరిమితం...
ABN , Publish Date - May 15 , 2024 | 12:37 PM
జమ్మలమడుగు నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు144 సెక్షన్ అమలు చేశారు. అభ్యర్థులను, కీలక నేతలను పోలీసులు ఇళ్లకే పరిమితం చేశారు. నిజమ్మలమడుగులోని వైసీపీ, బీజేపీ, టీడీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి.
కడప : జమ్మలమడుగు నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు144 సెక్షన్ అమలు చేశారు. అభ్యర్థులను, కీలక నేతలను పోలీసులు ఇళ్లకే పరిమితం చేశారు. నిజమ్మలమడుగులోని వైసీపీ, బీజేపీ, టీడీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ఎర్రగుంట్ల మండలం నిడిజివి గ్రామంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి వద్ద భారీ పోలీస్ బలగాలు మోహరించాయి.
Pawan Kalyan: మోదీకి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్
పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ప్రస్తుతానికి జమ్మలమడుగులో వరకూ పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకూ తావు లేకుండా చూస్తున్నారు. జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి, కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి త్రీ ప్లస్ త్రీ గన్‌మెన్ సౌకర్యం కల్పించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సైతం త్రీ ప్లస్ త్రీ గన్‌మెన్‌ను ఏర్పాటు చేశారు. నేతలను పూర్తిగా వారి వారి గ్రామాలకే పోలీసులు పరిమితం చేశారు.
ఇవి కూడా చదవండి...
AP Elections: నుదిటిపై గాయం.. రక్తమోడుతోన్న బెదరని ఏజెంట్
AP Elections: ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు.. ఎంతంటే?
Read Latest AP News And Telugu News