AP Election 2024: మాచర్లలో రెచ్చిపోయి దాడులు చేస్తున్న పిన్నెల్లి సోదరులు: నక్కా ఆనందబాబు
ABN , Publish Date - May 14 , 2024 | 09:20 PM
మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు పక్క రాష్ట్రం నుంచి గూండాలను పిలిపించి అల్లర్లు, అరాచకాలకు పాల్పడ్డారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు (Nakka Anand Babu) ఆరోపించారు. ఇప్పటికీ మాచర్లలో వైసీపీ గూండాలు దాడులకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
గుంటూరు జిల్లా: మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు పక్క రాష్ట్రం నుంచి గూండాలను పిలిపించి అల్లర్లు, అరాచకాలకు పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు (Nakka Anand Babu) ఆరోపించారు. ఇప్పటికీ మాచర్లలో వైసీపీ గూండాలు దాడులకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇవాళ కారంపూడి దాడులపై పల్నాడు ఎస్పీకి ముందుగానే సమాచారం ఇచ్చినా స్పందన లేదని... దీంతో మూడు గంటల పాటు కారంపూడి లో వైసీపీ మూకలు విధ్వంసం సృష్టించారని ధ్వజమెత్తారు.
AP Elections: తొలిసారి ఓటు కోసం రైలుకు ‘గ్రీన్ ఛానల్’
కారంపూడి తర్వాత దుర్గి మండలంలో దాడులు చేశారని చెప్పారు. కమ్మ సామాజిక వర్గం ఉండే గ్రామాల్లో దాడులు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. పిన్నెల్లి సోదరులు సమాజంలో తిరగటానకి అనర్హులని అన్నారు. జగన్ రెడ్డి ఇలాంటి అరాచకవాదులను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసులు ఇప్పటికీ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. పిన్నెల్లి సోదరులను పోలీసులు ఎందుకు కట్టడి చేయటం లేదని నిలదీశారు. వారిని గృహ నిర్బంధం చేసి ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి పై వైసీపీ దాడి చేసే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో అత్యధిక దాడులు మాచర్ల నియోజకవర్గంలో జరిగాయని అన్నారు. మాచర్లలో అరాచకం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. ఎన్నికల సంఘం ఆధీనంలో ఏపీ పోలీసులు ఎందుకు పని చేయటం లేదని ప్రశ్నించారు. పోలీసులు ఇంకా వైసీపీ మత్తులోనే ఉన్నారని నక్కాఆనంద్‌బాబు పేర్కొన్నారు.
Mukesh Kumar Meena: ఏపీలో 81 శాతం పైనే పోలింగ్..
Read Latest AP News And Telugu News