Home » AP Assembly Elections 2024
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మళ్లీ కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారనే ఓ చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో హల్‌చల్ చేస్తుంది. ఆ క్రమంలో ఆయన కింగ్ మేకర్‌గా వ్యవహరించే అవకాశాలు సైతం ఉన్నాయని సదరు సర్కిల్‌లో వైరల్ అవుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. ఆ రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల్లో సైతం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభంజనం సృష్టించింది.
తాజాగా వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసే ప్రభంజనం సృష్టించింది. మొత్తం పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రతిపక్షాల విషయంలో ఎంత అహంకారం ప్రదర్శించారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సీఎం స్థాయిలో..
అయిపోయింది.. అంతా అయిపోయింది. రాజన్న ముద్దుబిడ్డ.. గారలపట్టి వైయస్ షర్మిలకు మాత్రం రాజకీయ యోగం లేకుండా పోయిందని మహానేత వైయస్ఆర్ అభిమానుల్లో ఓ చర్చ అయితే వాడివేడిగా సాగుతుంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ కన్నతల్లి వైయస్ విజయమ్మ ముందే ఊహంచారా? అంటే ఆమె ముందే ఊహించి ఉండ వచ్చునని ఉమ్మడి కడప జిల్లా వాసులు తాజాగా అభిప్రాయ పడుతున్నారు.
కడప అంటే వైయస్ ఫ్యామిలీ.. వైయస్ ఫ్యామిలీ అంటే కడప. అలాంటి జిల్లాలో తాజా ఎన్నికల ఫలితాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి. జిల్లాలోని పలు కీలక అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అధిక్యంలో దూసుకు పోతుంది.
అధికారం శాశ్వతం అనుకుని ప్రత్యర్థి పార్టీల నేతలపై వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా బూతుల వర్షం కురిపించిన వైసీపీ మంత్రులకు ఆయా నియోజకవర్గాల ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. వైసీపీకి చెందిన పలువురు మంత్రలు అధిష్టానం దగ్గర మెప్పు కోసం తీవ్రమైన భాషతో ప్రత్యర్థి పార్టీల నేతలను తూలనాడారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు 130కి పైగా స్థానాల్లో విజయం సాధించారు. ఇదే సమయంలో టీడీపీ అనేక రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వరరావు ఘన విజయం సాధించారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ నేత వంగా గీతపై ఘన విజయం సాధించారు. అయితే పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కల్యాణ్ బరిలో దిగిన సమయంలో.. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన సవాల్ విసిరారు.
ఎన్నికల పలితాల్లో ఆంధ్రా ఓటరు.. తన ఓటుతో కొట్టిన దెబ్బకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మైండ్ బ్లాక్ అయి.. గ్రీన్ అయి.. రెడ్ అయిందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పేర్కొంటున్నారు.